News February 26, 2025
నేడు ఓర్వకల్లుకు ప్రముఖ లేడీ సింగర్ రాక

ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలోని శ్రీ భ్రమరాంబ సమేత బుగ్గ రామేశ్వర స్వామి ఆలయంలో బుధవారం శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత ఆధ్వర్యంలో నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రముఖ సింగర్ మధుప్రియ, పల్సర్ బైక్ ఝాన్సీ, రమేశ్ బృందం సందడి చేయనుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
Similar News
News February 26, 2025
HYDలో ప్రసిద్ధ శివాలయాలు ఇవే..!

మన జిల్లాలో ప్రసిద్ధ శివాలయాలు. 11వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యరాజు 6వ విక్రమాదిత్యుడు శంకర్‌పల్లిలో మరకత లింగాన్ని ప్రతిష్ఠించారని శాసనం చెబుతోంది. జ్యోతిర్లింగాల్లో ఒక్కటైన వైద్యనాథుడిని పోలి..ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. త్రేతాయుగంలో 101 లింగాలను కాశీ నుంచి ఆంజనేయుడు తీసుకురాగా..రాముడు కీసరలో ప్రతిష్ఠించాడు. షాద్నగర్ సమీపంలోని రాయకల్‌లో శ్రీరాముడు లింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి.
News February 26, 2025
HYDలో ప్రసిద్ధ శివాలయాలు ఇవే..!

మన జిల్లాలో ప్రసిద్ధ శివాలయాలు. 11వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యరాజు 6వ విక్రమాదిత్యుడు శంకర్‌పల్లిలో మరకత లింగాన్ని ప్రతిష్ఠించారని శాసనం చెబుతోంది. జ్యోతిర్లింగాల్లో ఒక్కటైన వైద్యనాథుడిని పోలి..ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. త్రేతాయుగంలో 101 లింగాలను కాశీ నుంచి ఆంజనేయుడు తీసుకురాగా..రాముడు కీసరలో ప్రతిష్ఠించారు. షాద్నగర్ సమీపంలోని రాయకల్‌లో శ్రీరాముడు లింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి.
News February 26, 2025
సంతాన ప్రాప్తి కలిగించే జ్యోతిర్లింగం ఘృష్ణేశ్వరం

ద్వాదశ జ్యోతిర్లింగాలలో మహారాష్ట్రలో ఉండే<<15583713>> ఘృష్ణేశ్వర<<>> ఆలయం చివరిది. స్థల పురాణం ప్రకారం శివుడి భక్తురాలి కుమారుణ్ని ఒక మహిళ కొలనులో విసిరేస్తుంది. దీంతో బాలుడు చనిపోతాడు. అంత బాధలోనూ ఆ మాత శంకరున్ని యధావిధిగా పూజిస్తుంది. పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆమె కుమారునికి ప్రాణం పోస్తాడు. అనంతరం భక్తురాలి కోరిక మేరకు అక్కడే వెలుస్తాడు. ఈ క్షేత్రాన్నిదర్శిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.