News December 23, 2024
నేడు కలెక్టరేట్‌లో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ
నంద్యాల పట్టణం కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ హలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే ప్రక్రియను పబ్లిక్ గ్రీవెన్స్ ద్వారా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 9:15 గంటలకు అధికారులు హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News December 23, 2024
కర్నూలు జిల్లాలో టీచర్ కిడ్నాప్.. కారణమిదేనా?
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అల్లుగుండు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు మునీర్ అహ్మద్ మూడోసారి కిడ్నాప్‌కి గురైన విషయం తెలిసిందే. అయితే దీనికి భూవివాదమే కారణమని తెలుస్తోంది. కర్నూలు సెంట్రల్ స్కూల్ వెనుక ఉన్న రూ.20 కోట్ల విలువచేసే భూవివాదమే కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ భూవివాదంలో మునీర్ ఇప్పటికే ఫిర్యాదుదారుగా ఉన్నారు. ప్రస్తుతం, దీనిపై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది.
News December 23, 2024
కర్నూలు జిల్లాలో రేషన్ డీలర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
కర్నూలు జిల్లాలో 201 డీలర్ పోస్టులను శాశ్వత ప్రాతిపాదికన భర్తీ చేసేందుకు కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో కర్నూలు డివిజన్‌లో 76, ఆదోని డివిజన్లో 80, పత్తికొండ డివిజన్లో 45 పోస్టులు ఉన్నాయన్నారు. అభ్యర్థులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అర్జీలను డిసెంబర్ 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు అందజేయాలని కోరారు.
News December 23, 2024
కర్నూలు: రైతు సొంత వైద్యం.. 30 గొర్రెలు మృతి
30 గొర్రెలు మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలంలో జరిగింది. తిమ్మందొడ్డి గ్రామానికి చెందిన చిన్నకు సుమారు 600 గొర్రెలు ఉన్నాయి. వాటికి బలం వచ్చేందుకు వైద్యుల అనుమతి లేకుండానే సొంతంగా టానిక్ తాపారు. వికటించడంతో సుమారు 30 గొర్రెలు మృతిచెందాయి. టానిక్ అధిక డోసు ఇవ్వడంతోనే మృత్యువాతపడినట్లు పశువైద్యుల రిపోర్టులో తేలింది. భారీ నష్టం జరగడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.