News January 7, 2025
నేడు కామారెడ్డికి మంత్రి జూపల్లి
నేడు కామారెడ్డిలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నట్లు కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు తెలిపారు. కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకారానికి మంత్రి హాజరవుతున్నారని పేర్కొన్నారు. మంత్రితో పాటు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొంటారని ఆయన వెల్లడించారు.
Similar News
News January 8, 2025
NZB: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఏసీపీ
సైబర్ నేరాలతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సైబర్ విభాగం ఏసీపీ వెంకటేశ్వర్ రావు సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని వివిధ శాఖల అధికారులకు, ఉద్యోగులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న సైబర్ మోసాల గురించి ఆయన ప్రస్తావించారు. వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సెల్ ఫోన్ లకు వచ్చే లింకులను ఓపెన్ చేయకూడదని సూచించారు.
News January 8, 2025
NZB: వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్, అధికారులు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ అంకిత్, డీఆర్డీవో సాయాగౌడ్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగోరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్లు నెలకొల్పే అంశంపై సమీక్ష జరిపారు.
News January 8, 2025
NZB: గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలి: కలెక్టర్
ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న ప్రభుత్వ గురుకులాల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. 2025-26 విద్యా సంవత్సరంలో వివిధ గురుకులాల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 23న కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. https://tgcet.cgg.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 01వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు.