News April 6, 2024

నేడు తుక్కుగూడ సభ.. పాలమూరు వాహనదారులకు అలర్ట్

image

కాంగ్రెస్‌ పార్టీ శనివారం తుక్కుగూడలో తలపెట్టిన జనజాతర బహిరంగ సభ నేపథ్యంలో.. సభకు వచ్చే వాహనదారులకు, సాధారణ వాహనదారులకు రాచకొండ సీపీ తరుణ్‌జోషి పలు సూచనలు చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు వాహనదారులు నిబంధనలు పాటించాలన్నారు. MBNR నుంచి వచ్చే వాహనాలు ఓఆర్‌ఆర్‌ బెంగుళూరు టోల్‌ నుంచి రావిర్యాల టోల్‌ వద్దనుంచి ఫ్యాబ్‌సిటీ వద్ద పార్కింగ్‌ ప్రాంతానికి చేరుకోవాలని సూచించారు.

Similar News

News April 21, 2025

MBNR: 9,970 GOVT జాబ్స్.. లైబ్రరీలకు నిరుద్యోగుల క్యూ

image

సికింద్రాబాద్ సహా పలు రైల్వే రీజియన్లలో 9,970అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టుల నోటిఫికేషన్ రావడంతో MBNR,NRPT,GDWL,WNP,NGKLలోని లైబ్రరీలకు నిరుద్యోగులు క్యూ కడుతున్నారు. సిలబస్ బుక్స్‌తో కసరత్తు చేస్తున్నారు. కొందరేమో HYDకు వెళ్లి కోచింగ్ సెంటర్లలో ప్రిపేర్ అవుతున్నారు. ఆన్‌లైన్ అప్లికేషన్‌కు మే 11 చివరి తేదీ. వెబ్‌సైట్: https://indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,7,1281

News April 21, 2025

MBNR: TGSRTCలో జాబ్స్‌.. ప్రిపరేషన్‌కు READY

image

TGSRTCలో 3,038 పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రకటించడంతో MBNR,NGKL,WNP,GDWL,NRPTలో నిరుద్యోగులు ప్రిపరేషన్‌కు రెడీ అవుతున్నారు. డ్రైవర్లు-2,000, శ్రామిక్-743, డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానికల్-114, ట్రాఫిక్- 84), DM/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ -25,అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్-18,సివిల్-23, సెక్షన్ ఆఫీసర్-11, అకౌంట్స్ ఆఫీసర్-6,మెడికల్ ఆఫీసర్స్ (జనరల్-7, స్పెషలిస్టు-7) పోస్టులు ఉన్నాయి.

News April 21, 2025

MBNR: ‘విద్యా వ్యవస్థను బలోపితం చేస్తాం’

image

సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో విద్యావ్యవస్థను బలోపితం చేసి విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ సభ్యుడు చారకొండ వెంకటేశ్ అన్నారు. బీటీఏ నేత బాల పీరు ఉద్యోగ విరమణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. విద్యార్థుల, ఉపాధ్యాయుల సమస్యలైన బదిలీలు, ప్రమోషన్స్, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు.

error: Content is protected !!