News January 27, 2025
నేడు నాగర్ కర్నూల్ జిల్లాలో మెగా జాబ్ మేళా

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నెల్లికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో నేడు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల నోడల్ అధికారి అంజయ్య తెలిపారు. పాక్స్ కాన్ కంపెనీ, కొంగరకలాన్ కంపెనీ హైదరాబాద్ వారు ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపారు. వెయ్యి మందికి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇట్టి అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని సూచించారు.
Similar News
News March 14, 2025
చింతలమానేపల్లి: వనదేవతలకు నిప్పు పెట్టిన వ్యక్తి అరెస్ట్

డబ్బా గ్రామంలో కొన్ని రోజుల క్రితం సమ్మక్క సారలమ్మలకు గుర్తుతెలియని వ్యక్తి నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన SI నరేశ్ విచారణ చేపట్టి అదే గ్రామానికి చెందిన మల్లేశ్ @ హరీశ్‌ను సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిగా గుర్తించినట్లు తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకొని సిర్పూర్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా అతడికి మతిస్థిమితం లేదని, ఎర్రగడ్డకు తరలించాల్సిందిగా తీర్పునిచ్చినట్లు వెల్లడించారు.
News March 14, 2025
ములుగు: సహజ రంగులను వినియోగించాలి: కలెక్టర్

ములుగు జిల్లా ప్రజలకు కలెక్టర్ దివాకర టీఎస్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాగద్వేషాలకు అతీతంగా అందరిని ఒక్కచోట చేర్చే హోళి పండుగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో హోలీ వేడుకలను సహజ రంగులను వినియోగిస్తూ, సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని కోరారు. ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని అన్నారు.
News March 14, 2025
జాతీయస్థాయి పోటీలకు మంచిర్యాల క్రీడాకారిణి

మంచిర్యాల జిల్లాకు చెందిన వెంకట జనని జాతీయస్థాయి కరాటే పోటీలకు ఎంపికైనట్లు జిల్లా స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు రవి, శివమహేశ్ తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో బంగారు పతకం సాధించిందని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటుందని పేర్కొన్నారు. జననిని అసోసియేషన్ సభ్యులు, తదితరులు అభినందించారు.