News April 25, 2024

నేడు నిజామాబాద్‌కు ఉత్తరాఖండ్ సీఎం రాక

image

ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి గురువారం జిల్లాకు రాన్నున్నారు. ఆయనతో కలిసి ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ మరో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ఆయన ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. బహిరంగ సభ కోసం పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News

News January 9, 2025

NZB: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చలి పంజా

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మళ్లీ చలి పంజా విసురుతుంది. 2 రోజులుగా నిలకడగా ఉన్న ఉష్ణోగ్రతలు ఈరోజు పడిపోయి చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.కామారెడ్డి జిల్లాలో అత్యల్పంగా డోంగ్లి 7.3, జుక్కల్ 8.1, మేనూర్ 9.0, గాంధారి 9.2 డిగ్రీలు నమోదు కాగా నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా కోటగిరి 10.4, నిజామాబాద్ సౌత్ 10.7, మెండోరా, ధర్పల్లిలో 11.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News January 9, 2025

చైనా మాంజ అమ్మితే చట్ట పరమైన చర్యలు: కామారెడ్డి SP

image

చైనా మాంజ అమ్మితే చట్ట పరమైన చర్యలు తప్పవని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ హెచ్చరించారు. చైనా మాంజాను నిషేధం విధించినప్పటికీ అక్కడక్కడ అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం ఉందన్నారు. దేవునిపల్లి PS పరిధిలో ఒక కేసు నమోదు చేసి 65 బెండ్లల్ల మంజాను స్వాధీనం చేసుకున్నామన్నారు. చైనా మాంజాను ఎవరైనా అమ్మితే 8712686112 కు సమాచారం అందించాలన్నారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

News January 9, 2025

NZB: దారుణం.. వీధి కుక్క నోట శిశువు మృతదేహం

image

రెంజల్ మండలం బోర్గం గ్రామంలో దారుణ ఘటన ఈరోజు వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. బోర్గం గ్రామంలో రోడ్డుపై ఓ వీధి కుక్క తన నోటితో ఒక మగ శిశువు మృతదేహాన్ని పట్టుకుని పరిగెడుతోంది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే ఆ కుక్కను తరిమికొట్టి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహానికి బొడ్డు తాడు అలాగే ఉండగా పుట్టగానే ఎవరో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు.