News September 7, 2024

నేడు నెల్లూరు జిల్లాకు వర్షసూచన

image

నెల్లూరు జిల్లా పరిధిలో నేడు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు, పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Similar News

News December 21, 2024

నాయుడుపేట: నదిలో కొట్టుకొచ్చిన అస్థిపంజరం

image

నాయుడుపేటలో అస్థిపంజరం కలకలం రేపింది. స్వర్ణముఖి నదిలో కొట్టుకొచ్చిన మనిషి అస్తిపంజరాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 21, 2024

నెల్లూరు: బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడి

image

బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడిన వ్యక్తికి శిక్ష పడింది. బాలాయపల్లిలోని ఓ బాలికను జయంపులో దుకాణం నడుపుతున్న ఓజిలి(M) ఇనుగుంటకు చెందిన సుబ్బారావు ప్రేమ పేరుతో నమ్మించాడు. సుబ్రహ్మణ్యం, వెంటకయ్య, వాణి సహయంతో 2015లో బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడ్డాడు. నేరం రుజువు కావడంతో నలుగురికి పదేళ్ల జైలు, రూ.22వేలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సిరిపిరెడ్డి సుమ నిన్న తీర్పుచెప్పారు.

News December 21, 2024

నిజాయతీగా పనిచేయండి: అబ్దుల్ అజీజ్

image

వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్లు నిజాయితీగా పనిచేయాలని, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ సూచించారు. 26 జిల్లాల ఇన్స్పెక్టర్ ఆఫ్ ఆడిటర్స్‌తో ఆయన నెల్లూరు నుంచి వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ… వక్ఫ్ ఆస్తులతో సంపద సృష్టించడానికి తీసుకోవాల్సిన చర్యలను సిద్ధం చేయాలని ఆదేశించారు.