News December 23, 2024

నేడు నెల్లూరులో జాబ్ మేళా

image

నెల్లూరులోని వెంకటేశ్వరపురం ప్రభుత్వ బాలుర ఐటీఐలో ఇవాళ ఉదయం 9 గ.లకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. పలు ప్రముఖకంపెనీ ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా చదివిన వారు అర్హులు అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.

Similar News

News December 23, 2024

బాలాయపల్లిలో ఎర్రచందనం దొంగ అరెస్ట్

image

మూడు ఎర్రచందనం దుంగలు కలిగి ఉన్న ఒక వ్యక్తిని టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. హెచ్‌సీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. బాలాయపల్లి మండలం గంగరాజుపల్లి సమీపంలోని సున్నపురాళ్ల కోన వద్దకు చేరుకోగా ఒక వ్యక్తి అనుమానస్పదంగా కనిపించాడు. విచారించగా అతని వద్ద మూడు ఎర్రచందనం దుంగలు లభ్యమయ్యాయని, అతడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

News December 23, 2024

NLR: పాపం.. బిర్యానీలో విషం పెట్టి చంపేశారు..!

image

అందరూ అయ్యో పాపం అనేలా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సోమవారం దారుణ ఘటన వెలుగు చూసింది. సూళ్లూరుపేట గాండ్ల వీధి షార్ బ్రిడ్జి కింద పదుల సంఖ్యలో కుక్కలు చనిపోయాయి. ఎవరో కావాలనే బిర్యానీలో విషం పెట్టి కుక్కలను చంపేశారని స్థానికులు చెబుతున్నారు. వాటితో ఇబ్బంది ఉంటే పట్టుకెళ్లి దూరంగా వదిలేయాలి కానీ.. ఇలా విషం పెట్టి చంపడం ఘోరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News December 23, 2024

నెల్లూరు: స్మార్ట్ మీటర్లకు డబ్బులు వసూలు చేస్తే చర్యలు 

image

నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేస్తున్న విద్యుత్ స్మార్ట్ మీటర్లకు వినియోగదారులు డబ్బులు చెల్లించనవసరం లేదని APSPDCL సర్కిల్ ఎస్ఈ విజయన్ తెలిపారు. ఉచితంగా మీటర్లను బిగిస్తామని ఆయన వెల్లడించారు. కొత్తగా విద్యుత్ సర్వీసు కనెక్షన్లు కావాలనుకునే వారు ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్దేశించిన రుసుం మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. సిబ్బంది అదనంగా నగదు వసూలు చేస్తే వారిపై చర్యలు తప్పవన్నారు.