News October 26, 2024

నేడు పద్మశ్రీ గుస్సాడి కనకరాజు అంత్యక్రియలు

image

ఆసిఫాబాద్: పద్మశ్రీ గుస్సాడీ కనకరాజు అంత్యక్రియలు నేడు స్వగ్రామం జైనూర్ మండలం మర్లవాయిలో జరగనున్నాయి. శుక్రవారం అనారోగ్యంతో ఆయన కన్నుమూయగా.. పలువురు సంతాపం తెలిపారు. ఏటా దీపావళి సమయంలో గుస్సాడీ నృత్యంతో అలరించే ఆయన ఈసారి పండగ ముందే కన్నుమూయడంతో ఆదివాసీ గూడేల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా ఆదివాసీల గుస్సాడీ నృత్యానికి వన్నెతెచ్చిన కనగరాజును 2021లో ‘పద్మశ్రీ’ వరించింది.

Similar News

News November 22, 2024

చెన్నూర్: ఐదు ఉద్యోగాలు సాధించిన గోదారి మౌనిక

image

మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం చెల్లాయిపేటకు చెందిన మౌనిక నిన్నవిడుదలైన జెఎల్ (ఇంగ్లీష్) ఫలితాల్లో ఉద్యోగాన్ని సాధించింది. కాగా గతంలో మరో నాలుగు ఉద్యోగాలు సాధించారు. టీజీటీ, పీజీటీ, జేఎల్, డీఎల్ జాబ్స్ కి ఎంపికయ్యారు. దీంతో ఆమెకు కుటుంబ సభ్యులు, స్నేహతుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. తమ కుతూరు అయిదు ఉద్యోగాలు సాధించడం పట్ల ఆమె తల్లిదండ్రులు హన్మయ్య- అంకుపోసు హార్షం వ్యక్తం చేస్తున్నారు.

News November 22, 2024

నిర్మల్: నవజాత శిశువుకు అరుదైన శస్త్ర చికిత్స

image

ప్రాణాపాయ స్థితిలో ఉన్న నవజాత శిశువుకు వైద్యులు ఆపరేషన్ విజయవంతంగా చేసి పాప ప్రాణాలు కాపాడిన ఘటన గురువారం నిర్మల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగింది. వైద్యులు సంతోష్ రాజ్ మాట్లాడుతూ.. ఇచ్చోడ మండలానికి చెందిన ఓ గర్భిణి నవజాత శిశువుకు జన్మనిచ్చింది. అన్నవాహికకు జీర్ణాశయానికి సంబంధం లేకపోవడంతో ప్రాణాపాయ స్థితిలో ఉండగా ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడినట్లు డాక్టర్ తెలిపారు.

News November 22, 2024

విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలి: ADB కలెక్టర్

image

పది, ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా గురువారం నిర్వహించారు. పదో తరగతలో ప్రత్యేక తరగతులు నిర్వహించి డిసెంబర్ నాటికి సబ్జెక్టుల వారీగా సిలబస్ పూర్తి చేసి జనవరి నుంచి 2025 రివిజన్ చేపట్టాలని సూచించారు. ఇంటర్మీడియట్‌లో మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. వెనుకబడిన విద్యార్ధులపై ప్రత్యేక శ్రద్ద వహించాలని అధికారులకు సూచించారు.