News February 2, 2025

నేడు పుంగనూరుకు రానున్న జనసేన అగ్రనాయకత్వం

image

సోమల ZP హైస్కూల్‌లో ఇవాళ ‘జనంలోకి జనసేన’ భారీ బహిరంగ సభ జరగనున్న విషయం తెలిసిందే. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుతోపాటూ పార్టీ అగ్రనాయకత్వం తరలిరానున్నారు. నాయకులు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. బహిరంగ సభలో నేతలు ఏం మాట్లాడుతారన్న చర్చ ఆసక్తిగా మారింది. టిడ్కో ఛైర్మన్ అజయ్, తిరుపతి MLA ఆరిని శ్రీనివాస్, ఉ.చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్‌లు హాజరుకానున్నారు. 

Similar News

News February 3, 2025

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చిత్తూరు ఎంపీ

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ప్రచారంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీకి ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు ఆదివారం ఘనస్వాగతం పలికారు. ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

News February 2, 2025

పుంగనూరుకు చేరుకున్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు

image

సోమల మండలంలో జరుగు ‘జనంలోకి జనసేన’ బహిరంగ సభ సందర్భంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు చేరుకున్నారు. ఆయనతోపాటు తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు, టిడ్కో ఛైర్మన్ అజయ్ కుమార్, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ చదల్ల గ్రామంలోని ఎం. వేణుగోపాల్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. సుమారు నాలుగు గంటల ప్రాంతంలో సోమల బహిరంగ సభలో పాల్గొననున్నారు.

News February 2, 2025

గృహ నిర్మాణాల్లో పురోగతి సాధించాలి: చిత్తూరు కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణాల పురోగతి పై ప్రత్యేక దృష్టి సారించిందని, రానున్న మూడు నెలల కాలంలో యుద్ధ ప్రాతిపదికన ఇంటి నిర్మాణాలు చేపట్టి పురోగతి సాధించాలని హౌసింగ్, ఎంపీడీవోలు, మున్సిపల్ అధికారులను కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. శనివారం హౌసింగ్ డిమాండ్ సర్వే, గృహ నిర్మాణ పురోగతి పై హౌసింగ్ పీడీ, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోలతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.