News January 21, 2025
నేడు పుట్టపర్తిలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు
పుట్టపర్తిలో నేడు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా రవాణా శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రశాంతి గ్రామంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. ఇందులో రహదారి భద్రత నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
Similar News
News January 21, 2025
ఆంధ్ర రంజీ జట్టుకు అనంత జిల్లా కుర్రాడు
అనంతపురం జిల్లాకు చెందిన వినయ్ కుమార్ ఆంధ్ర రంజీ జట్టుకు ఎంపికయ్యాడు. అనంతపురం మండలం కురుగుంటకు చెందిన వినయ్ కుమార్.. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణిస్తున్నాడు. ఇప్పటికే పలు ట్రోఫీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. రంజీ జట్టుకు వినయ్ కుమార్ ఎంపిక కావడం పట్ల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News January 21, 2025
శ్రీ సత్యసాయి జిల్లా వ్యక్తికి అండగా నారా లోకేశ్
శ్రీ సత్యసాయి జిల్లా రొళ్ల మండల టీడీపల్లికి చెందిన చంద్రప్ప తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. పేద కుటుంబం కావడంతో ఆదుకోవాలంటూ ఓ నెటిజన్ ట్విటర్ వేదికగా మంత్రి నారా లోకేశ్‌ను కోరారు. స్పందించిన మంత్రి చంద్రప్పకు అవసరమైన సహాయాన్ని తన టీమ్ వెంటనే అందజేస్తుందని హామీ ఇచ్చారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు చికిత్స కోసం రూ.25 వేల ఆర్థిక సాయం అందజేశారు.
News January 20, 2025
కానిస్టేబుల్ అభ్యర్థులకు అనంతపురం ఎస్పీ సూచన
అనంతపురం జిల్లాలో కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలకు వివిధ కారణాలతో గైర్హాజరైన వారికి మంగళవారం అవకాశం కల్పిస్తున్నట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. జిల్లాలో గత నెల 30 నుంచి దేహదారుఢ్య పరీక్షలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ రోజుల్లో గైర్హాజరు అయిన వారు రేపు పరీక్షల్లో పాల్గొనాలని కోరారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.