News April 11, 2025
నేడు ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం

వయోవృద్ధులు, వికలాంగుల కోసం ఈ నెల 11న శుక్రవారం (నేడు) రోజున ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు విచ్చేసి గ్రీవెన్స్ డేను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రత్యేక శ్రద్ధతో అర్జీల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు.
Similar News
News April 19, 2025
కేతేపల్లి: తండ్రి మందలించడంతో యువకుడి సూసైడ్

తండ్రి మందలించడంతో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. కేతేపల్లి మండలం వెంకన్నపల్లికి చెందిన కొండయ్య(32) డ్రైవర్‌గా పనిచేసేవాడు. బైక్ విషయంలో తండ్రి, కొడుకు మధ్య గొడవ జరగగా తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురై ఈనెల 16న పురుగు మందు తాగాడు. సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
News April 19, 2025
నల్గొండ: రూ.300 కోట్లు మోసం చేశారని ఆందోళన

విప్స్ కంపెనీ డైరెక్టర్లమని తమను నమ్మించి మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విప్స్ కంపెనీ బాధితులు కోరారు. ఈ మేరకు శుక్రవారం నల్గొండ డీఎస్పీ కార్యాలయం వద్ద నిరసన తెలిపి, డీఎస్పీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ.. కంపెనీలో డైరెక్టర్లమని ప్రజలను మభ్యపెట్టి జిల్లాలో దాదాపు రూ.300 కోట్ల పెట్టుబడులు పెట్టించి మోసం చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
News April 19, 2025
నల్గొండ: రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దు: DRO

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని నల్గొండ ఇన్ఛార్జ్ డీఆర్ఓ వై.అశోక్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండ మండల కేంద్రంలోని కంచనపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కాంటా వేయాలన్నారు. మిల్లులకు పంపించే ధాన్యం వివరాలను కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జ్ బట్టు నవీన్‌ను అడిగి తెలుసుకున్నారు.