News June 24, 2024
నేడు మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నారా లోకేశ్
మంగళగిరి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో నారా లోకేశ్ గెలుపొందిన సంగతి తెలిసిందే. అనంతరం రాష్ట్ర క్యాబినెట్లో లోకేశ్‌కి స్థానం దక్కింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం 9.45 గంటలకు వెలగపూడిలో ఉన్న రాష్ట్ర సచివాలయం నాలుగో బ్లాక్‌లోని ఆయన ఛాంబర్లో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతల స్వీకరించనున్నారు.
Similar News
News November 18, 2024
‘శవ రాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు’
శవ రాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ గా మారారని చిలకలూరిపేట MLA ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. ఆదివారం చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కుటుంబం విషాదంలో ఉంటే తమ్ముడిని తొక్కేశాడని, కుటుంబంలో వివాదం ఉందని జగన్ మీడియా వార్తలు రాయటం దారుణమన్నారు. సొంత మనుషులను రాజకీయంగా వాడుకొని ఎలా వదిలేయాలో జగన్‌కు తెలిసినట్లు ఎవరికీ తెలియదు అన్నారు. ముందు తల్లి, చెల్లికి సమాధానం చెప్పాలన్నారు.
News November 17, 2024
విద్యార్థిని ఆత్మహత్యపై నివేదిక కోరిన బాలల హక్కుల కమిషన్
నరసరావుపేట భావన కళాశాల ఇంటర్ విద్యార్థిని అనూష ఆత్మహత్యపై ఆదివారం రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి నివేదికను కోరారు. పోలీస్ శాఖ, విద్యాశాఖ సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికను తక్షణమే పంపాలని ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. దురదృష్టకరమైన ఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేసి తల్లిదండ్రులకు సానుభూతి తెలిపారు.
News November 17, 2024
సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు.. శ్రీరెడ్డిపై కేసు నమోదు
సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి శ్రీరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దాసరి జ్యోతి శ్రీరెడ్డిపై నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు శ్రీరెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వీరనాయక్ చెప్పారు.