News February 24, 2025

నేడు వరంగల్ మార్కెట్ ప్రారంభం

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున:ప్రారంభం కానుంది. మొన్న, నిన్న వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో నేడు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.

Similar News

News February 24, 2025

ఎనుమాముల మార్కెట్‌‌కు తరలొచ్చిన మిర్చి

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు పెద్ద ఎత్తున మిర్చి బస్తాలు వచ్చాయి. సుమారు 90 వేల బస్తాలు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ సంవత్సరంలో అత్యధిక బస్తాలు ఈరోజే వచ్చాయన్నారు. మిర్చి యార్డ్ మొత్తం ఎర్ర బంగారంతో నిండిపోయింది. సాధ్యమైనంత తక్కువ సమయంలో కాంటాలు పెట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులకు మంచినీటి సదుపాయం ఏర్పాటు చేశారు.

News February 24, 2025

WGL: మందుబాబులకు బ్యాడ్ న్యూస్

image

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. దీంతో వరంగల్, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, ములుగు, హనుమకొండ జిల్లాల్లోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.

News February 24, 2025

రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసినా గెలవరు: బండి

image

కేంద్రమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. MLC ఎన్నికల్లో ఓడిపోతున్నామని కాంగ్రెస్‌కు తెలిసిపోయిందని, ఏ సర్వే చూసినా విజయం BJPదేనని తేల్చడంతో కంగుతిన్న సీఎం రేవంత్ రెడ్డి తానే స్వయంగా ఎన్నికల్లో దిగి పైసలు పంచేందుకు సిద్ధమయ్యారన్నారు. రేవంత్ కాదు కదా…రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసినా MLC ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదన్నారు.

error: Content is protected !!