News June 12, 2024
నేడే CM ప్రమాణస్వీకారం.. ప.గో. జిల్లాలో ఏర్పాట్లు
రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నూతన మంత్రివర్గం సైతం ఏర్పాటుకానుంది. ఈ నేపథ్యంలో సదరు కార్యక్రమాన్ని వీక్షించేలా.. ఉమ్మడి ప.గో. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల అధికారులు LED స్క్రీన్లు, టీవీలను ఏర్పాటుచేశారు. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పటికే విద్యుత్ కాంతులతో సిద్ధం చేశారు.
– మీ వద్ద పరిస్థితి ఏంటి..?
Similar News
News November 28, 2024
వాటికి అనుమతులు తప్పనిసరి: ప.గో DMHO
ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్లు, ల్యాబ్లు, ఫిజియోథెరఫీ సెంటర్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు నిర్వహించడం నేరమని ప.గో జిల్లా DMHO డి.మహేశ్వరరావు హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు అన్నీ అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తే అనుమతులు ఇస్తామని చెప్పారు. ఆయా సెంటర్ల వద్ద పరీక్షల ఫీజు బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
News November 28, 2024
ఓ రూముకు నా పేరు పెట్టి బెదిరిస్తున్నారు: RRR
తనను వేధించిన వాళ్లంతా జైలుకు వెళ్లడం వాళ్లు చేసుకున్న కర్మేనని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు(RRR) పేర్కొన్నారు. ‘ముసుగు వేసుకుని మరీ నన్ను కొట్టారు. ఆరోజు నా ఛాతీపై బరువైన వ్యక్తి కూర్చోవడంతో మంచం కోళ్లు కూడా విరిగిపోయాయి. నన్ను ఏ రూములో అయితే కొట్టారో దానికి RRR పేరు పెట్టారు. ఆ తర్వాత ఆ రూములోకి ఎంతోమందిని తీసుకెళ్లి బెదిరించి దందాలు చేశారు’ అని RRR చెప్పారు.
News November 28, 2024
ఏలూరు: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం
ఏలూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఎస్ఐ శివాజీ వివరాల ప్రకారం.. దెందులూరు మండలంలోని ఓ గ్రామంలో భార్యాభర్తలు అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇంటి ఓనర్ కుమారుడు 9వ తరగతి చదువుతున్నాడు. అతను అద్దెకు దిగిన వారి నాలుగేళ్ల కుమార్తెపై నవంబర్ 25న అత్యాచారం చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని జువైనల్ హోంకు తరలించారు.