News March 30, 2024
నేడే కామారెడ్డిలో అవిశ్వాస తీర్మానం.. తీవ్ర ఉత్కంఠ..!

కామారెడ్డి మున్సిపల్ ఛైర్ పర్సన్ జాహ్నవి పై నేడే అవిశ్వాస పరీక్ష నిర్వహించనున్నారు. FEBలో 27మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్‌కి అధ్యక్ష పదవిపై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ ఫిర్యాదుచేయగా ఈనెల 30న బలపరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. అవిశ్వాసం నెగ్గాలంటే 34 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుతం కాంగ్రెస్ క్యాంపులో 36 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఏదేమైనా ఏం జరుగుతుందో అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
Similar News
News April 22, 2025
చందూర్: ఉరేసుకొని రైతు ఆత్మహత్య

చందూరు మండల కేంద్రంలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అర్కల గోపాల్ రెడ్డి(46) పొలం పెట్టుబడి, పురుగుమందుల కోసం ఫర్టిలైజర్ షాపులో అరువుగా మందులు తీసుకువచ్చి డబ్బులు చెల్లించకపోవడంతో ఫర్టిలైజర్ యజమాని కోర్టును ఆశ్రయించారు. కోర్టు నోటీసు పంపించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్ఐ మహేశ్ చెప్పారు.
News April 22, 2025
NZB: దరఖాస్తుల ఆహ్వానం

జిల్లా వ్యాప్తంగా పాఠశాల విద్యా శాఖ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు మండల, జిల్లా స్థాయిలలో శిక్షణ ఇవ్వడానికి సబ్జెక్ట్ రిసోర్స్ పర్సన్ల (MRP, DRP)లను నియమించడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ అశోక్ తెలిపారు. జిల్లాలోని ఆయా ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన దరఖాస్తుల ద్వారా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ నియామకం చేపడుతుందన్నారు.
News April 22, 2025
ధర్పల్లి: వడదెబ్బతో రైతు మృతి

ధర్పల్లి మండలం వాడి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం వడదెబ్బతో కరక రాములు(65) అనే రైతు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఇటీవల తన పొలంలో యంత్ర సాయంతో పంట కోయించారు. యంత్రం వెళ్లలేని ప్రాంతంలో మిగిలిపోయిన పంటను ఉదయం నుంచి కోస్తూ వడదెబ్బకు గురై మృతి చెందినట్లు తెలిపారు.