News March 23, 2024

నేను గెలవగానే కేసులు ఎత్తివేయిస్తా: పులపర్తి

image

వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో భీమవరం నియోజవర్గ జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను గెలవగానే జన సైనికుల మీద మత్స్యపురి అల్లర్లలో అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయిస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా ఇన్‌ఛార్జ్ కొటికలపూడి గోవిందరావు, జడ్పిటిసి గూండా జయప్రకాశ్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News April 10, 2025

నల్లజర్ల : చిన్నపిల్లలతో HIV ఉన్న వృద్ధుడి అసభ్య ప్రవర్తన

image

చిన్నారులను HIV ఉన్న ఓ వృద్ధుడు లైంగిక చర్యలతో వేధించిన ఘటన నల్లజర్ల మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. దీనిపై పోక్సో కేసు నమోదు చేశారు. పాఠశాలలో 4,5 తరగతి చదువుకుంటున్న చిన్నారులు స్కూల్ అయ్యాక ఆడుకుంటుండగా వారికి చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి ఆయిల్‌పామ్ తోటలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఓ బాలుడు తన తల్లికి చెప్పగా ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సాయంతో సీఐ రాంబాబు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

News April 10, 2025

పాలకొల్లు : లవ్ మ్యారేజ్ ..మూడు నెలలకే ఆత్మహత్య

image

ప్రేమ వివాహం చేసుకున్న మూడు నెలలకే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పాలకొల్లులో జరిగింది. 28వ వార్డుకు చెందిన సతీశ్ మంగళవారం భార్యతో గొడవపడ్డాడు. మనస్తాపానికి గురై బుధవారం ఇంట్లో ఉరివేసుకున్నాడు. కుటుంబీకులు పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని సోదరుడు వెంకటేశ్ ఫిర్యాదుతో ఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేశామన్నారు.

News April 10, 2025

ప.గో జిల్లా రొయ్య రైతు ఆవేదన

image

ప.గో జిల్లాలో రొయ్య రైతులు అయోమయంలో పడ్డారు. రాష్ట్రంలో ఆక్వాసాగు 5.75 లక్షల ఎకరాల్లో ఉంటే, ఉమ్మడి ప.గో జిల్లాలోనే 2.63 లక్షల ఎకరాల్లో ఉత్పత్తి జరుగుతూ మొదటి స్థానంలో నిలిచింది. కొనుగోలు దారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించారని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో జూలై నుంచి పంట బ్రేక్‌కు పిలుపునిచ్చారు. బుధవారం ఉండిలో జరగాల్సిన ఆక్వా రైతుల సదస్సు వాయిదా పడింది.

error: Content is protected !!