News February 3, 2025

నేరడిగొండలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

image

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని వాంకిడి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బోథ్ మండలం కౌట గ్రామానికి చెందిన నోముల వెంకట్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 3, 2025

ADB: బీజేపీ బాధ్యతలు బ్రహ్మానంద్‌కే..!

image

భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పతాంగె బ్రహ్మానంద్ నియమితులయ్యారు. దీంతో ఆయన రెండవసారి జిల్లా అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఆయన గతంలో గుడిహత్నూర్ జడ్పీటీసీగా పనిచేశారు. ఆయన నియామకంపై పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

News February 3, 2025

ఒమన్ దేశంలో జన్నారం వాసి మృతి

image

జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన దుర్గం మల్లేష్(48) ఓమన్ దేశంలో గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మల్లేష్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మల్లేష్ ఏడాది క్రితం ఒమన్ దేశానికి బతుకుదెరువు కోసం వెళ్లాడు. వచ్చే శనివారం రెండవ కుమార్తె పెళ్లి జరగనుంది. ఇంతలోనే మల్లేష్ మృతితో కవ్వాల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News February 3, 2025

ఆదిలాబాద్: దివ్యాంగుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

వికలాంగుల ఉపాధి, పునరావాస పథకం కింద దివ్యాంగులకు స్వయం ఉపాధి కల్పించటానికి అర్హులైన దివ్యాంగులు దరఖాస్తులు చేసుకోవాలని ఆదిలాబాద్ DWO సబిత తెలిపారు. అర్హులైన దివ్యాంగులు ఈనెల 12 తేదీ లోపు https://tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ పథకం క్రింద బ్యాంకు లింకేజ్ లేకుండా నేరుగా రూ.50 వేలు సబ్సిడీ వర్తిస్తుందన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 21 యూనిట్లు జిల్లాకు కేటాయించడం జరిగిందన్నారు.