News January 9, 2025
నైపుణ్యత గల ఉపాధ్యాయులను తయారు చేయాలి: తుమ్మల
ఖమ్మం జిల్లాలోని డైట్ కళాశాల ద్వారా నైపుణ్యత గల ఉపాధ్యాయులను తయారు చేసి సమాజానికి అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం టేకులపల్లిలో పర్యటించి డైట్ అడ్మినిస్ట్రేటివ్ భవన ఆధునీకరణ, అదనపు సదుపాయాల ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేశారు. 70 సం.ల్లో అనేక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఆశించిన స్థాయిలో విద్యను అభివృద్ధి చేయలేక పోయామని చెప్పారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి చాలా కీలకమైందన్నారు.
Similar News
News January 10, 2025
ఇందిరమ్మ ఇళ్ల ఫిర్యాదులకు వెబ్సైట్: పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మరింత పారదర్శకమైన సేవలను అందించాలనే లక్ష్యంతో ఫిర్యాదుల కోసం గ్రీవెన్స్ మాడ్యూల్‌ను తీసుకువచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్‌లో మంత్రి గ్రీవెన్స్ మాడ్యూల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఏమైనా సమస్యలు ఎదురైతే indirammaindlu.telangana.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
News January 10, 2025
KMM: రాష్ట్ర స్థాయి పోటీల్లో మొదటి స్థానంలో ప్రణీత్
భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం పరిధిలోని జగన్నాథపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఇ.ప్రణీత్ మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ నెల 7,8,9 తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ జూనియర్ విభాగంలో మొదటి స్థానాన్ని సాధించినట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ఈ క్రమంలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థిని, గైడ్ సారలమ్మను టీచర్లు, గ్రామస్థులు అభినందించారు.
News January 10, 2025
పర్యాటక ప్రాంతంగా ఖమ్మం ఖిల్లా అభివృద్ధి: కలెక్టర్
ఖమ్మం ఖిల్లా పైకి వెళ్లేందుకు ఏర్పాటు చేయనున్న రోప్‌వే, జాఫర్ బావి అభివృద్ధితో ఖమ్మం పర్యాటక ప్రాంతంగా మారుతుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం ఖమ్మం ఖిల్లాను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఖిల్లాకు రోప్‌వే ఏర్పాటుకు అనువుగా ఉండే మార్గం, ఎక్విప్మెంట్, ఖిల్లాకు రావడానికి రోడ్డు అనుకూలత, పార్కింగ్, టాయిలెట్స్ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు.