News January 23, 2025
నైపుణ్యాలను వెలికి తీయండి: కలెక్టర్
విద్యార్థుల్లో ఉన్న ప్రతిభాపాటవాలను నైపుణ్యాలను వెలికితీయాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా అన్నారు. బుధవారం కర్నూలులోని కలెక్టరేట్లోని బాలోత్సవం-2025 పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఎక్కువ మంది విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని బాలోత్సవ కమిటీ నిర్వాహకులకు కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో బాలోత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు డీ.ధనుంజయ, జేఎన్ శేషయ్య పాల్గొన్నారు.
Similar News
News January 23, 2025
కర్నూలు జిల్లా పోలీసులను అభినందించిన డీజీపీ
కర్నూలు జిల్లాలో పోలీసుల కృషి, పనితీరు అభినందనీయమని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. బుధవారం నగరంలోని వ్యాస్ ఆడిటోరియంలో డీఐజీ ప్రవీణ్ సమక్షంలో సమీక్ష నిర్వహించారు. డీజీపీ మాట్లాడుతూ.. ప్రజలకు మరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో పని చేయాలన్నారు. విజబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, సైబర్ నేరాలను కట్టడి చేయాలని సూచించారు. ఎస్పీ బిందు మాధవ్ హాజరయ్యారు.
News January 22, 2025
12వ రోజు 286 మంది అభ్యర్థుల ఎంపిక
ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలు ఏపీఎస్పీ రెండో బెటాలియన్‌లో 12వ రోజు దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. 600 మంది అభ్యర్థులకు గాను 415 మంది అభ్యర్థులు బయోమెట్రిక్‌కు హజరయ్యారన్నారు. ఫైనల్ పరీక్షకు 286 మంది అభ్యర్థులు అర్హత సాధించారని ఎస్పీ తెలిపారు.
News January 22, 2025
రూ.291.67 కోట్లతో కర్నూలు నగరపాలక అంచనా బడ్జెట్
కర్నూలు నగరపాలక సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంచనాల బడ్జెట్‌ను స్థాయీ సంఘం ఆమోదించింది. నగరపాలక కార్యాలయంలో మేయర్ బీవై రామయ్య అధ్యక్షతన స్థాయీ సంఘ సమావేశం బుధవారం నిర్వహించారు. రూ.291.67 కోట్లతో బడ్జెట్ రూపకల్పన చేశారు. మొత్తం ఆదాయం రూ.363.99 కోట్లు, ఖర్చు రూ.201.22 కోట్లు, రెవెన్యూ ఆదాయం రూ.201.22 కోట్లు, ప్రభుత్వ గ్రాంట్లు రూ.162.77 కోట్లు, మూలధన రాబడి రూ.138.69 కోట్లు.