News December 30, 2024

న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్పీ 

image

న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. ఆదివారం కనగల్ పోలీస్ స్టేషన్‌ను ఆయన సందర్శించి మాట్లాడారు. కుటుంబ సమేతంగా ఇళ్లల్లో నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం, రోడ్లపై తిరుగుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు.

Similar News

News January 5, 2025

మానవ వ్యాధుల నివారణలో ఔషధ మొక్కల పాత్ర కీలకం

image

మానవ వ్యాధుల నివారణలో ఔషధ మొక్కల పాత్ర కీలకమని కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు ఆచార్య ముస్తఫా అన్నారు. శనివారం మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఔషధ మొక్కలపై నిర్వహించిన అతిథి ఉపన్యాస కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. వృక్షాల వర్గీకరణ, ఔషధ మొక్కలు, వృక్షజాతుల గుర్తింపు , ముఖ్యంగా వ్యాధుల నివారణలో మొక్కల యొక్క పాత్రను విద్యార్థులకు వివరించారు.

News January 4, 2025

NLG: సమ్మెలో హమాలీలు.. సంక్రాంతికి పస్తులేనా?

image

ఉమ్మడి NLG జిల్లాలో పండుగపూట కార్డుదారుల ప’రేషన్’ మొదలైంది. ఈ నెల 1నుంచి హమాలీలు సమ్మెలో ఉండగా ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. రేషన్ షాపుల్లో ప్రతినెలా 1వ తేదీ నుంచి 15వరకు బియ్యం పంపిణీ చేసేవారు. హమాలీలు సమ్మె చేస్తుండడంతో బియ్యం ఇంకా రేషన్ దుకాణాలకు చేరలేదు. సంక్రాంతి పండుగకు పిండి వంటలు చేసేందుకు బియ్యమే కీలకం కాగా ఇంకా రేషన్ దుకాణాల్లో పంపిణీ లేకపోవడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

News January 4, 2025

BREAKING: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

image

నల్గొండ జిల్లా తిప్పర్తి మండల శివారులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న బైక్‌ను వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో బైక్‌ చెట్టుని ఢీకొంది. ప్రమాదంలో కారులో ఉన్న మహిళ ఎగిరి పొలంలో పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. గాయాలైన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ఈఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.