News March 4, 2025
ప.గో: MLCగా గెలిచిన రాజశేఖరం నేపథ్యం ఇదే..!

ఉభయగోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన పేరాబత్తుల రాజశేఖరం స్వగ్రామం కోనసీమ జిల్లాలోని జి.వేమవరం. తొలుత ఆయన కాంగ్రెస్ ఎంపీటీసీగా, అనంతరం టీడీపీ నుంచి ఎంపీపీ, జడ్పీటీసీగా పనిచేశారు. ఆక్వా వ్యాపారం చేసే రాజశేఖరం ప్రస్తుతం కాకినాడలో నివాసం ఉంటున్నారు. B.com పూర్తిచేసిన ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న రాజశేఖరానికి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి వరించింది.
Similar News
News March 4, 2025
అంగన్వాడీల సమస్యలపై కలెక్టర్కు వినతిపత్రం

పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుతూ జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణికి అంగన్వాడీలు వినతి పత్రాన్ని మంగళవారం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 42 గంటల్లో సమస్యలు పరిష్కరించాలన్నారు. 10వ తేదీన జరిగే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
News March 4, 2025
సబ్సిడీ రుణాల లబ్ధిదారులను ఎంపిక చేయండి: కలెక్టర్

ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా వివిధ సబ్సిడీ రుణాల మంజూరుకు లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో ఆయా కార్పొరేషన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై మాట్లాడారు. మార్చి 31లోపు రుణాలు గ్రౌండింగ్ అయ్యేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
News March 4, 2025
MLC ఎన్నికల్లో తొలిసారి గెలవబోతున్న టీడీపీ అభ్యర్థి..!

గోదావరి గడ్డపై పట్టభద్రుల MLC స్థానంలో టీడీపీ నుంచి తొలివిజయం నమోదు కానుంది. 2007లో శాసనమండలి ఏర్పడ్డాక 2007, 2013, 2019 గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. గోదావరి జిల్లాలో గత 3సార్లు పీడీఎఫ్ లేదా ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. అలాంటి గోదావరి గడ్డపై రాజశేఖరం గెలుపు దాదాపు ఖరారైంది. 80వేల ఓట్లు మెజార్టీ సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతం 41,153 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.