News January 3, 2025

ప.గో: ఎకో-సెన్సిటివ్ జోన్ ఖరారుపై గ్రామసభలు

image

ఆకివీడు, ఉండి, పెంటపాడు, గణపవరం, కాళ్ల మండలాలలో ఎకో-సెన్సిటివ్ జోన్ ఖరారుపై జనవరి 6న గ్రామ సభలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. కొల్లేరు అభయారణ్యం చుట్టు ప్రక్కల ఎకో-సెన్సిటివ్ జోన్ ఖరారు చేయడంపై స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ఈ సమావేశాలు ఉంటాయన్నారు. ఆయా మండలాలకు సంబంధించి కొల్లేరు పరిధిలోని ప్రజలు గ్రామసభలకు హాజరై అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు.

Similar News

News January 7, 2025

గోపాలపురం: మొక్కజొన్న ఆడే మెషిన్ మీద పడి వ్యక్తి మృతి

image

ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో గోపాలపురం మండలంలోని గోపవరంలో మంగళవారం వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. పొట్రా లక్ష్మణరావు (45) తన భుజంపై మొక్కజొన్నలు ఆడే మెషిన్ మోసుకుంటూ వెళ్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడిపోయాడు. మిషన్ లక్ష్మణరావుపై పడటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య మల్లీశ్వరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

News January 7, 2025

టీ.నర్సాపురం: అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ప్రేమ జంటకు వివాహం

image

టీ.నర్సాపురం ప్రధాన సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం ప్రేమ జంట పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. టి.నర్సాపురం(M) బొర్రంపాలెంకి చెందిన ఇమ్మడిశెట్టి నాగేశ్వరి, కే.జగ్గవరానికి చెందిన బాలు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుని ఇవాళ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఇరు వర్గాల కుటుంబ సభ్యులను పిలిపించి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. పెద్దల సమక్షంలో అంబేద్కర్ విగ్రహం వద్ద దండలు మార్చుకున్నారు.

News January 7, 2025

ఉండి: చిన్నారులను ఆడించిన లోకేశ్

image

ఉండి నియోజకవర్గంలో సోమవారం మంత్రి నారా లోకేశ్ పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద అమిరంలో చిన్నారులతో లోకేశ్‌ దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆయన చిన్నారులను ఎత్తుకుని గుండెలపై ఆడించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతకుముందు డిప్యూటీ స్పీకర్ రఘురామ, కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ నివాసంలో మూడు పార్టీల కేడర్‌తో భేటీ అయ్యారు.