News March 3, 2025

ప.గో : కొన్ని గంటల్లో ఉత్కంఠకు తెర

image

గత నెల 27వ తేదీన జరిగిన ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. కాగా అభ్యర్థులు అందరూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. తుది ఫలితం సోమవారం సాయంత్రం 6 గంటలకు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Similar News

News March 4, 2025

‘మహిళా దినోత్సవం రోజు భారీ ర్యాలీ చేపట్టండి’ 

image

మార్చి 8న మ‌హిళా దినోత్సవంలో భాగంగా భారీగా ర్యాలీ ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. ఈ మేరకు ఆమె క్యాంపు కార్యాలయంలో సోమవారం అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. మహిళా దినోత్సవం రోజున ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ప్రకాశం చౌక్ నుంచి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు సుమారు వెయ్యి మంది మహిళలతో ర్యాలీ నిర్వహించాలన్నారు. ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు.

News March 4, 2025

సర్వేలను సకాలంలో పూర్తిచెయ్యాలి: కలెక్టర్

image

జిల్లాలో సర్వేలను సకాలంలో పూర్తిచెయ్యలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం నుంచి ఆమె మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో సమీక్ష గూగుల్ మీట్ నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది చేస్తున్న సర్వేలపై చర్చించారు. పి-4 సర్వేపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

News March 3, 2025

ప.గో. జిల్లా TODAY TOP HEADLINES

image

✷ తణుకులో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన మహిళా అఘోరి ✷ నన్నయ యూనివర్సిటీ అధ్యాపకురాలికి అరుదైన గౌరవం ✷ భీమవరం: ఇయర్ ఫోన్స్ వాడకం తగ్గించాలి  ✷ గోదావరి పుష్కరా పై అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి ✷ అత్తిలిలో సాగునీరు అందించాలని ఆందోళన ✷మహిళా దినోత్సవం రోజున భారీ ర్యాలీ 

error: Content is protected !!