News December 28, 2024

ప.గో: గన్ మిస్ ఫైర్..రిటైర్డ్ ఉద్యోగికి గాయాలు

image

సర్వీసు గన్ మిస్ ఫైర్ అయిన ఘటనలో రిటైర్డ్ మిలిటరీ ఉద్యోగి స్వల్ప గాయాల పాలయ్యాడు. నిడదవోలు మండలం కాటకోటేశ్వరంకు చెందిన మిలిటరీ ఉద్యోగి కారింకి శ్రీనివాస్ తన గన్‌ను ప్రతి 6 నెలలకోసారి నిడదవోలు సీఐ కార్యాలయంలో తనిఖీ చేయిస్తుంటారు. గురువారం నిడదవోలు పోలీస్ కార్యాలయానికి తన గన్‌ను చెక్ చేయించడానికి తీసుకువచ్చి స్టేషన్ బయట కూర్చుని గన్ శుభ్రం చేస్తుండగా ట్రిగ్గర్ వేలికి తగిలి మిస్ ఫైర్ అయ్యింది.

Similar News

News December 29, 2024

ప.గో.: ఆ కేసును కొట్టివేయండి: మంత్రి

image

ఏలూరు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో ఉన్న కేసును కొట్టివేయాలని కోరుతూ.. మంత్రి నిమ్మల రామానాయుడు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. హాజరు నుంచి మినహాయింపుతో పాటు కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేసి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. 2022లో పాలకొల్లులో టిడ్కో ఇళ్లకు అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వడంలేదంటూ నిమ్మల నిరసన వ్యక్తం చేశారు. అప్పుడు వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News December 29, 2024

సంక్రాంతి పండుగ.. హోటల్స్‌కు ఫుల్ డిమాండ్

image

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప.గో జిల్లాలోని హోటల్స్, లాడ్జిలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఇక్కడి ఉత్సవాలు, కోడిపందేలను తిలకించేందుకు రాష్ట్రాంలోని పందెం రాయుళ్లు పెద్ద ఎత్తున వస్తుంటారు. దీంతో రూమ్‌ల అద్దెలు కొండెక్కాయి. భీమవరం, ఏలూరు, తణుకు, నర్సాపురం, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో 4 రోజులకు గాను రూ.25 వేల- రూ.35 వేల వరకు అద్దెలున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌లతో హోటల్స్ బుక్ అయిపోయాయి.

News December 29, 2024

కొల్లేరుపై నిర్వహించిన లిడార్ సర్వేపై ఏలూరు కలెక్టర్ సమీక్ష

image

కొల్లేరుపై 2022-23లో నిర్వహించిన లిడార్ సర్వే పూర్తవడంతో దానిపై శనివారం శాఖల అధికారులతో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రీసెల్వి సమీక్ష నిర్వహించారు. గ్రౌండ్ ట్రూ థింగ్ కోసం అటవీ శాఖ అధికారులు ప్రతిపాదించిన అంశాలపై చర్చించారు. శాస్త్రీయబద్ధంగా ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి, లిడార్ సర్వే ఏజెన్సీ ప్రతినిధులు, అటవీ శాఖ, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.