News January 7, 2025

ప.గో జిల్లా ఓటర్ల వివరాలు: కలెక్టర్

image

 ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ -2025 ప్ర‌క్రియ‌ అనంత‌రం ఓట‌ర్ల తుది జాబితాను జిల్లా క‌లెక్ట‌ర్ నాగరాణి సోమవారం ప్రకటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జనవరి 6 నాటికి జిల్లాలోని మొత్తం 1,461 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 14,70,852 మంది ఓట‌ర్లు ఉన్నారన్నారు. వీరిలో పురుష ఓట‌ర్లు 7,20,597, మ‌హిళ‌లు 7,50,179, థ‌ర్డ్ జెండ‌ర్ 76 మంది ఉన్నారు.

Similar News

News January 9, 2025

రెవెన్యూ సదస్సులో 4,560 అర్జీలు: కలెక్టర్

image

ప.గో.జిల్లాలో 27 రోజులు పాటు 318 గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల ద్వారా 4,560 అర్జీలను స్వీకరించడం జరిగిందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. డిసెంబర్ 13 నుంచి జనవరి 8 వరకు భూ సమస్యలపై రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరిగిందన్నారు. అర్జీల పరిష్కారానికి ప్రభుత్వం 45 రోజులు గడువు విధించిందని, నిర్ణీత సమయంలోగా నూరు శాతం అర్జీలను పరిష్కరిస్తామని తెలిపారు.

News January 8, 2025

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు: నరసాపురం ఆర్డీవో

image

లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నరసాపురం ఆర్డీవో దాసిరాజు హెచ్చరించారు. నరసాపురం ఆర్డీవో కార్యాలయంలో గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధ చట్టం అమలు (పీసీ, పీఎన్డీటీ) కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్స్‌పై నిరంతరం నిఘా ఉంటుందన్నారు. ఆరోగ్య శాఖ సిబ్బంది డివిజన్లోని స్కానింగ్ సెంటర్స్‌‌లో నిత్యం తనిఖీలు నిర్వహించాలన్నారు.

News January 8, 2025

ప.గో: కోడి పందేల నిర్వహణపై హైకోర్టు కీలక ఆదేశాలు

image

ఉభయగోదావరి జిల్లాల్లో కోడి పందేల నిర్వహణపై మంగళవారం హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పందేలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశిస్తూ న్యాయమూర్తి లక్ష్మీనరసింహ చక్రవర్తి ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో సంక్రాంతికి నిర్వహించే కోడిపందేలపై ఉత్కంఠ నెలకొంది. సంప్రదాయబద్ధంగా వస్తున్న పందేలను పూర్తిగా ఆపేయకుండా, కత్తులు కట్టకుండా నిర్వహిస్తే మంచిదని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్