News October 28, 2024

ప.గో. జిల్లాలో రూ.73 కోట్లతో రైల్వే స్టేషన్లు అభివృద్ధి

image

ఉమ్మడి ప.గో.జిల్లాలోని రైల్వే స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్కీం ద్వారా అభివృద్ధి చేయనుంది. ఇందులో రాష్ట్రంలోని 53 స్టేషన్లు ఎంపిక కాగా జిల్లాలోని పలు స్టేషన్లకూ చోటు దక్కింది. తాడేపల్లిగూడెం, నిడదవోలు జంక్షన్ అభివృద్ధికి రూ.27 కోట్లు, నరసాపురం, రేపల్లెకు రూ.25 కోట్లు, భీమవరం టౌన్, ఏలూరు స్టేషన్లలో రూ.21 కోట్లతో ఆధునికీకరణ పనులు చేపట్టనున్నారు. 

Similar News

News November 17, 2024

నరసాపురం: సబ్ జైల్ తనిఖీ చేసిన జడ్జీ వరలక్ష్మి

image

జైల్ అదాలత్ కార్యక్రమంలో భాగంగా టౌన్ లోని సబ్ జైల్‌ను ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ (జూనియర్ డివిజన్) ఆర్. వరలక్ష్మి శనివారం పర్యవేక్షించి నిందితుల కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి అందిస్తున్న ఆహార పదార్థాలు, మంచినీటి సౌకర్యాలు, వైద్య సదుపాయాలు తదితర విషయాలను ముద్దాయిలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత న్యాయ సలహాదారులు జైల్ ముద్దాయిలకు అందించే న్యాయ సహాయంపై న్యాయమూర్తి ఆరా తీశారు.

News November 16, 2024

అసెంబ్లీలో RRRతో విశాఖ ఎమ్మెల్యే వాగ్వాదం

image

ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్ RRR, విశాఖ MLAకి మధ్య వాగ్వాదం జరిగింది. కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుపై విష్ణుకుమార్ రాజు మాట్లాడుతుండగా టైం అయిపోందని RRR బెల్ కొట్టారు. ‘మీరు అప్పుడే బెల్ కొడితే ఎలా అధ్యక్షా. గంట పర్మిషన్ తీసుకున్నా’ అని MLA చెప్పగా.. ‘అందరికీ కలిపి ఒక గంట సమయం ఇచ్చారు. మీకు ఒక్కరికే కాదు. ఇంకా 25 మంది మాట్లాడాలి. త్వరగా ముగించండి’ అంటూ మరికాస్త సమయం ఇచ్చారు.

News November 16, 2024

జంగారెడ్డిగూడెం పోలీసుల కస్టడీలో బోరుగడ్డ అనిల్

image

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న బోరుగడ్డ అనిల్‌ను జంగారెడ్డిగూడెం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అతను గుంటూరులో ఓ వ్యక్తిని రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించిన కేసులో రాజమండ్రి జైలులో ఉన్నారు. అయితే అదే సమయంలో JRGలోని వేలురుపాడు పోలీస్ స్టేషన్‌లో అతనిపై మరోకేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతితో శుక్రవారం జంగారెడ్డిగూడెం పోలీసులు రాజమండ్రి నుంచి రెండురోజుల కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిపారు.