News December 4, 2024

ప.గో: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. అభ్యర్థులు వీరే

image

ఉభయగోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. గంధం నారాయణరావు, పులుగు దీపక్, డాక్టర్ కావల నాగేశ్వరరావు, నామన వెంకటలక్ష్మి, బొర్రా గోపి మూర్తి బరిలో ఉన్నారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

Similar News

News December 5, 2024

ఉభయ గోదావరి జిల్లాల్లో ఓటు వేయనున్న 16,737 మంది టీచర్లు

image

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు నేడు జరగనున్నాయి. దీంతో అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ ఎన్నికల్లో దాదాపు 16,737 మంది టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లాలోని ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. నేడు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. ఈ నెల 9న కాకినాడ జేఎన్టీయూలో కౌంటింగ్ జరగనుంది.

News December 4, 2024

ఏలూరు జిల్లాలో భూ ప్రకంపనలు

image

ఏలూరు జిల్లాలో బుధవారం ఉదయం భూకంపం వచ్చిందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, కన్నాపురం, వేలూరుపాడు, చింతలపూడి, ద్వారకాతిరుమల తదితర చోట్ల ఐదు సెకండ్ల పాటు భూమి కంపించిందన్నారు. ఇంట్లో ఉన్న సామాగ్రి ధ్వంసమవ్వడంతో.. బయటికి పరుగులు తీసినట్లు తెలిపారు. అయితే ఎక్కడా ప్రాణనష్టం జరగక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. 

News December 4, 2024

ఏలూరు: ప్రేమ పేరుతో మోసం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై కేసు 

image

ఏలూరు సత్యనారాయణ పేట చెందిన షాజహాన్ (29) (సాఫ్ట్‌వేర్ ఉద్యోగి) పై కేసు నమోదైనట్లు సీఐ సత్యనారాయణ బుధవారం తెలిపారు. వారి కథనం పట్టణానికి చెందిన యువతికి (23) ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. అయితే ఆమెను వద్దని, వారంలో వేరే యువతితో పెళ్లికి రెడీ అయ్యాడు. విషయం తెలుసుకున్న ప్రియురాలు షాజహాన్ ఇంటి ముందు బైఠాయించి న్యాయం చేయాలని ఆందోళన వ్యక్తం చేసింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.