News June 10, 2024

ప.గో: డేంజర్ హైవే.. 17 నెలల్లో 104 మంది మృతి

image

ఉమ్మడి ప.గో-తూ.గో జిల్లాను కలుపుతూ గుండుగొలను నుంచి కొవ్వూరు వరకు దాదాపు 70KM పొడవున రూ.1800 కోట్ల వ్యయంతో నిర్మించిన హైవే ప్రమాదాలకు అడ్డాగా మారింది. హైవే ఎక్కాలంటే వాహనదారులు భయపడుతున్నారు. ఈ రూట్‌లో దేవరపల్లి మండలం డేంజర్ స్పాట్. ఈ మార్గంలో 2023 JAN నుంచి 2024 మే వరకు (17 నెలలు) దాదాపు 156 ప్రమాదాలు జరగ్గా.. 104 మంది ప్రాణాలు కోల్పోయారు. 150 మంది గాయాలపాయ్యారు.

Similar News

News November 28, 2024

వాటికి అనుమతులు తప్పనిసరి: ప.గో DMHO

image

ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌లు, ఫిజియోథెరఫీ సెంటర్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్‌లు నిర్వహించడం నేరమని ప.గో జిల్లా DMHO డి.మహేశ్వరరావు హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు అన్నీ అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తే అనుమతులు ఇస్తామని చెప్పారు. ఆయా సెంటర్ల వద్ద పరీక్షల ఫీజు బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

News November 28, 2024

ఓ రూముకు నా పేరు పెట్టి బెదిరిస్తున్నారు: RRR

image

తనను వేధించిన వాళ్లంతా జైలుకు వెళ్లడం వాళ్లు చేసుకున్న కర్మేనని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు(RRR) పేర్కొన్నారు. ‘ముసుగు వేసుకుని మరీ నన్ను కొట్టారు. ఆరోజు నా ఛాతీపై బరువైన వ్యక్తి కూర్చోవడంతో మంచం కోళ్లు కూడా విరిగిపోయాయి. నన్ను ఏ రూములో అయితే కొట్టారో దానికి RRR పేరు పెట్టారు. ఆ తర్వాత ఆ రూములోకి ఎంతోమందిని తీసుకెళ్లి బెదిరించి దందాలు చేశారు’ అని RRR చెప్పారు.

News November 28, 2024

ఏలూరు: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

image

ఏలూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఎస్ఐ శివాజీ వివరాల ప్రకారం.. దెందులూరు మండలంలోని ఓ గ్రామంలో భార్యాభర్తలు అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇంటి ఓనర్ కుమారుడు 9వ తరగతి చదువుతున్నాడు. అతను అద్దెకు దిగిన వారి నాలుగేళ్ల కుమార్తెపై నవంబర్ 25న అత్యాచారం చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని జువైనల్ హోంకు తరలించారు.