News January 2, 2025

ప.గో: న్యూఇయర్ రోజున పలు ప్రమాదాల్లో ఆరుగురు మృతి

image

న్యూ ఇయర్ రోజున ఉమ్మడి ప.గో(D)లో పలు ప్రమాదాల్లో ఏడుగురు చనిపోయారు. బైక్‌లు ఢీకొనడంతో భీమవరంలో మహేశ్(18), మరో ప్రమాదంలో ముదినేపల్లిలో వెంకటేశ్వరరావు మృతి చెందారు. రైలు ఢీకొని ఏలూరులో ఓ వృద్ధుడు, మంటలు అంటుకుని టి.నర్సాపురానికి చెందిన సీతారావమ్మ, అతిగా మద్యం తాగి నూతిలో పడి ఏలూరులో శ్రీనివాసరావు, చెరువులో మునిగిపోయి చెరుకువాడలో పెద్దిరాజు మృతి చెందాడు. ఇరగవరంలో వాహనాలు ఢీకొని నలుగురికి గాయాలయ్యాయి.

Similar News

News April 23, 2025

పాలకోడేరు : ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. ఐదుగురికి అస్వస్థత

image

పాలకోడేరు మండలం మోగల్లు వశిష్ట మెరైన్స్ ఆక్వా పరిశ్రమలో అమ్మోనియా గ్యాస్ లీకై ప్రమాదం సంభవించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన ఐదుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో భీమవరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు.

News April 23, 2025

ప.గో : టెన్త్ రిజల్ట్స్..17,695 మంది పాస్

image

పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ప.గో.జిల్లాలో మొత్తం 21,539 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 17,695 మంది పాసయ్యారు. 10,924 మంది బాలురు రాయగా 8,612 మంది పాసయ్యారు.10,615 మంది బాలికలు పరీక్ష రాయగా 9,083 మంది పాసయ్యారు. 82.15 పాస్ పర్సంటేజ్ తో పశ్చిమగోదావరి జిల్లా 16 వ స్థానంలో నిలిచింది.

News April 23, 2025

తాడేపల్లిగూడెం : ఆటోల దొంగ అరెస్ట్

image

తాడేపల్లిగూడెంలో ఆటోలు దొంగిలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని,రూ. 14 లక్షల విలువైన 7 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. వరుసగా ఆటోలు చోరీకి గురవుతున్నాయని కేసులు నమోదు అవుతుండడంతో ప్రత్యేక నిఘా పెట్టినట్లు డీఎస్పీ ఎం. విశ్వనాథ్ తెలిపారు. మామిడితోటకు చెందిన వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడిందన్నారు. పార్క్ చేసి ఉన్న ఆటోలను తెల్లారేసరికి మాయం చేసేవాడని తెలిపారు.

error: Content is protected !!