News February 24, 2025
ప.గో: రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు..కలెక్టర్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా సోమవారం జిల్లా, డివిజన్, మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను జిల్లా అంతటా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పీజీఆర్ఎస్ నిర్వహించే తేదీని ప్రకటన ద్వారా తెలియచేస్తామని కలెక్టర్ తెలిపారు. అర్జీదారులు గమనించాలన్నారు.
Similar News
News April 21, 2025
పెంటపాడు: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి.. కేసు నమోదు

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన పెంటపాడు(M) ఆలంపురం వద్ద ఆదివారం జరిగింది. మౌంజీపాడుకి చెందిన నిర్మల(42) తన కుమారుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా అలంపురం వద్ద అకస్మాత్తుగా కుక్క అడ్డు వచ్చింది. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి ఇద్దరు కిందపడ్డారు. నిర్మల తలకు బలమైన గాయం తగలడంతో తణుకు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించారు. మృతురాలి కుమార్తె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
News April 20, 2025
పాలకొల్లు: ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల అరెస్ట్

ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న పాలకొల్లుకు చెందిన ఎం.వెంకటరావు, ఏ.మురళీలను ఆదివారం పాలకొల్లు టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నరసాపురం డీఎస్పీ శ్రీవేద వివరాలను వెల్లడించారు. గత కొంతకాలంగా హైదరాబాద్, విశాఖ కేంద్రంగా ఇరువురు ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్నారు. నిందితుల నుంచి 10 మొబైల్ ఫోన్లు, రూ.33,000 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.
News April 20, 2025
రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

భీమవరంలోని గరగపర్రు రోడ్డులో శుక్రవారం రాత్రి ఇద్దరు బీటెక్ విద్యార్థులు బైక్‌పై వెళుతూ ఎదురుగా వస్తున్న బైకుని తప్పించిపోయి డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రాజమండ్రికి చెందిన జ్ఞాన సాగర్(21) తలకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ఇజ్రాయెల్ శనివారం తెలిపారు. మరో విద్యార్థి సాయి భరత్ స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు అయింది.