News July 23, 2024
ప.గో.: వరద నీటిలోనే మృతదేహాన్ని మోస్తూ..

కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలంలోని పోచవరంలో జరిగిన ఓ ఘటన కన్నీళ్లు పెట్టించింది. భారీ వర్షాలకు గ్రామంలోని దళిత సామాజిక వర్గానికి చెందిన శ్మశానవాటిక వరదనీటిలో మునిగిపోయింది. మంగళవారం గ్రామంలోని దళితవాడలో ఓ వ్యక్తి చనిపోగా.. మృతదేహాన్ని ఖననం చేసేందుకు మృతుడి బంధువులు ఇబ్బందులు పడ్డారు. మోకాళ్ల లోతు వరద నీటిలోనే శ్మశాన వాటికకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది.
Similar News
News March 11, 2025
భీమవరం: ఆన్ లైన్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్

ఆన్ లైన్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురు ముఠా సభ్యులను ప.గో. జిల్లా పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ జయసూర్య వివరాలు వెల్లడించారు. నలుగురుని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.13 లక్షల విలువగల 54 మొబైల్ ఫోన్స్, 3 ల్యాప్టాప్స్, నెట్వర్కింగ్ డివైసెస్ స్వాధీనం చేసుకున్నారు.
News March 11, 2025
ప.గో: ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 162 మంది గైర్హాజరు

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా సోమవారం ఇంటర్మీడియట్ (APOSS) పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని విద్యాశాఖ అధికారి నారాయణ తెలిపారు. ఇవాళ జరిగిన ఫిజిక్స్ , పొలిటికల్ సైన్స్ పరీక్షలకు 11,77 మంది విద్యార్థులకు గాను 1,015 మంది హాజరు అయ్యారు అని తెలిపారు. 162 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వెల్లడించారు. మొత్తంగా 86.24 % హాజరు నమోదయిందని తెలిపారు.
News March 11, 2025
12,13న రైతులకు కీలక సదస్సులు

ఈ నెల 12, 13న భీమవరంలో పూలసాగు, ఉద్యాన విలువ ఆధారిత ఉత్పత్తులపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు రోజులపాటు రైతులకు, ఉత్పత్తి దారులకు శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నామని తెలిపారు. 12న రక్షిత వ్యవసాయ పద్ధతులపై, 13న పంట కోత అనంతరం తీసుకోవలసిన జాగ్రత్తలపై శిక్షణ తరగతులు జరుగుతాయని తెలిపారు.