News April 8, 2025

పంచాయతీ కార్యదర్శుల బదిలీల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి: ఆకుల రాజేందర్

image

హనుమకొండ జిల్లా టీఎన్జీవోస్ యూనియన్ అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు పెద్ద సంఖ్యలో కలెక్టర్ పి.ప్రావిణ్యను కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్‌లో కలిసి పంచాయతీ కార్యదర్శుల బదిలీల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆకుల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో బదిలీలు చేయడం సరికాదని కోరారు.

Similar News

News April 18, 2025

ఖమ్మం జిల్లాకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

image

ఖమ్మం జిల్లాకు ఖమ్మం అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా. ఖమ్మం నగర మధ్యలో ఉన్న స్తంభాద్రి నుంచి మండపాలకు, స్తంభాలకు కావాల్సిన రాళ్లు తరలించేవారని చరిత్ర చెబుతుంది. ఉర్దూ భాషలో ఖమ్మం అంటే స్తంభం అని అర్ధం. అలాగే నరసింహస్వామి పేరు మీద ఈ పేరు వచ్చిందనే వాదన ఉంది. బ్రిటిష్ వారి పాలనలో ఈ ప్రాంతాన్ని ‘ఖమ్మం మెట్టు’ అని పిలిచేవారనే మరో వాదన ఉంది. దీంతో ఖమ్మంకు అలా పేరు వచ్చిందని చెబుతున్నారు.

News April 18, 2025

భద్రాద్రి కొత్తగూడెంకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా. ఆదివాసీలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఊరును గూడెంగా పిలుస్తారు. కొత్తగా ఏర్పడిన గూడెం కొత్తగూడెంగా మారింది. కొత్తగూడెం సింగరేణి బొగ్గు గనుల ప్రాంతం.. ఇక్కడ సింగరేణి హెడ్ ఆఫీస్ ఉండడం వల్ల దక్షిణ భారతదేశపు బొగ్గు పట్టణంగానూ పిలుస్తారు. అలాగే భద్రాచలం రామాలయం పేరు భద్రాద్రిగా మారింది. నూతనంగా ఏర్పడిన జిల్లా భద్రాద్రి కొత్తగూడెంగా అవతరించింది.

News April 18, 2025

కీవ్‌లో భారత ఫార్మా గోడౌన్‌పై దాడి.. ఉక్రెయిన్‌కు రష్యా కౌంటర్

image

కీవ్‌లో APR 12న భారత ఫార్మా గోడౌన్‌పై దాడి జరగ్గా, దానికి కారణం రష్యా క్షిపణి అని ఉక్రెయిన్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై రష్యా తాజాగా స్పందించింది.
ఉక్రెయిన్ క్షిపణుల వల్లే ఇది జరిగి ఉంటుందని కౌంటర్ ఇచ్చింది. ఆ దాడి తాము చేయలేదని భారత్‌లోని రష్యా ఎంబసీ స్పష్టం చేసింది. నివాస ప్రాంతాల్లో రాకెట్ లాంచర్లు, ఫిరంగులు సహా ఇతర సైనిక పరికరాలను మోహరించడం ఉక్రెయిన్‌కు పరిపాటిగా మారిందని మండిపడింది.

error: Content is protected !!