News October 31, 2024
పండుగ పూట విషాదం.. ఇద్దరు బాలురు మృతి
వలిగొండ మండల కేంద్రంలో పండుగ పూట విషాదం నెలకొంది. మండల కేంద్రానికి చెందిన జీవన్, కిరణ్ అనే ఇద్దరు చిన్నారులు చేపల వేటకు వెళ్లి మూసిలో గల్లంతయ్యారు. కిరణ్ అనే చిన్నారి మృతదేహం లభ్యం కాగా జీవన్ మృతదేహాం కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీంతో వారిరువురి కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి
Similar News
News October 31, 2024
యాదాద్రి: మాదాపూర్‌లో క్రీడలు.. CMకు ఆహ్వానం
తుర్కపల్లి మండలం మాదాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న SFG రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మండల ఎంఈఓ మాలతి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
News October 31, 2024
చౌటుప్పల్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం.. దంపతులు మృతి
చౌటుప్పల్ సమీపంలోని మల్కాపూర్ స్టేజీ వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కారును వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నకిరేకల్‌కు చెందిన దంపతులు బొబ్బల నర్సింహరెడ్డి, సరోజిని మృతిచెందారు. డ్రైవర్‌కు గాయాలయ్యాయి.
News October 31, 2024
రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లోే డబ్బులు జమ చేయాలి: కలెక్టర్
ధాన్యం అమ్మిన రైతుల బ్యాంకు ఖాతాలలో రెండు రోజుల్లో డబ్బులు జమ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం నల్గొండ సమీపంలోని ఆర్జాల బావి, ఎస్ఎల్బీసీ బత్తాయి మార్కెట్ల వద్ద ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి రైతులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నదని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.