News February 23, 2025

పండుగలు సామరస్యంతో జరుపుకోవాలి: KMR ఎస్పీ

image

మత సామరస్యం, సోదర భావంతో పండుగలు జరుపుకోవాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. వచ్చే నెల 2 రంజాన్ మాసం ప్రారంభమవడంతో కలెక్టర్ లో శనివారం నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని మసీదుల వద్ద శాంతి భద్రతలను పోలీసు యంత్రాంగం పర్యవేక్షిస్తుందని తెలిపారు. పండుగ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుందని చెప్పారు.

Similar News

News December 20, 2025

నేటి నుంచి రాజధాని యువతకు CRDA-SRM ఉచిత నైపుణ్య శిక్షణ

image

AP CRDA SRM యూనివర్శిటీతో కలిసి రాజధాని ప్రాంత యువత కోసం ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించింది. డిసెంబర్ 20 నుంచి అమరావతిలోని SRM క్యాంపస్‌లో ఈ శిక్షణలు నిర్వహించనున్నారు. కోర్సుల్లో ఉచిత శిక్షణతో పాటు భోజనం, రవాణా సౌకర్యం కల్పిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు https://tinyurl.com/srmapcrda లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని CRDA కమిషనర్ తెలిపారు.

News December 20, 2025

కృష్ణమ్మ ఒడిలో లగ్జరీ హౌస్ బోట్లు

image

పర్యాటక రంగానికి కొత్త కళ తెచ్చేలా కృష్ణా నదిలో లగ్జరీ హౌస్ బోట్లను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. విజయవాడ బెర్మ్ పార్క్ నుంచి పవిత్ర సంగమం వరకు 20 కి.మీ మేర ఈ బోట్లు ప్రయాణిస్తాయి. ఏసీ, అత్యాధునిక బెడ్రూమ్‌లు, డైనింగ్ హాల్ వంటి సౌకర్యాలతో పర్యాటకులకు కేరళ అనుభూతిని అందించనున్నాయి. త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని పర్యాటక శాఖ అధికారులు వెల్లడించారు.

News December 20, 2025

అపరాల పంటల్లో బంగారు తీగ కలుపు నివారణ

image

అపరాల పంటలకు బంగారు తీగ కలుపు ముప్పు ఎక్కువ. అందుకే పంట విత్తిన వెంటనే ఎకరాకు 200L నీటిలో పెండిమిథాలిన్ 30% 1.25 లీటర్లను కలిపి పిచికారీ చేయాలి. వరి మాగాణిలో మినుము విత్తితే వరి పనలు తీసిన వెంటనే ఎకరాకు 1.25L పెండిమిథాలిన్ 30%ను 20KGల ఇసుకలో కలిపి పొలంలో చల్లాలి. అలాగే మినుము విత్తిన 20 రోజులకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో ఇమజితాఫిర్ 10% 200mlను కలిపి పిచికారీ చేసి బంగారు తీగ కలుపును నివారించవచ్చు.