News May 9, 2024

పగడ్బందీగా ఎన్నికల నియమావళి అమలు : ఎస్పీ

image

జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల సమయం సమీపిస్తున్నoదున రానున్న 72 గంటలు ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేస్తామని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే గురువారం తెలిపారు. ఈనెల11వ తేదీ నుండి ఎన్నికల రోజైన 13వ తేది వరకు ముందస్తుగా జిల్లా వ్యాప్తంగా 48 గంటల నిబంధనలు పటిష్టంగా ఉంటాయన్నారు. 144 సెక్షన్ అమలులో ఉంటుందని… సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదన్నారు.

Similar News

News November 28, 2024

డిసెంబర్ 5లోగా ధాన్యం కొనుగోళ్ళను పూర్తి చేయాలి: కోమటిరెడ్డి

image

జిల్లాలో ధాన్యం కొనుగోళ్ళను డిసెంబర్ 5లోగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. గురువారం నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ ఇలా త్రిపాటితో రివ్యూ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని ఆదేశించారు.

News November 28, 2024

SRPT: విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్

image

ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్‌లో విద్యార్థుల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవార్ అన్నారు. ఇవాళ ఐడిఓసి సమావేశ మందిరం నందు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫ్రీ పోస్ట్ మెట్రిక్యులేషన్ హాస్టల్స్ సంక్షేమ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వసతి గృహాల సంక్షేమ అధికారులు స్థానికంగా ఉంటూ సమస్యలు లేకుండా పరిష్కరించాలని అన్నారు.

News November 27, 2024

NLG: రేపటి డిగ్రీ పరీక్షలు యథాతధం

image

ఈ నెల 28 (గురువారం) నుంచి జరగాల్సిన డిగ్రీ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని మహాత్మా గాంధీ యూనివర్సిటీ సీఈవో డా.జి.ఉపేందర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఎటువంటి వదంతులను నమ్మవద్దని ఆయన సూచించారు. డిగ్రీ పరీక్షలకు విద్యార్థులంతా హాజరుకావాలని కోరారు.