News January 27, 2025
పథకాల పంపిణీపై ఉద్యోగుల సేవలు భేష్: BPL కలెక్టర్

భూపాలపల్లి జిల్లాలో నాలుగు పథకాల జారీ ప్రక్రియలో భాగస్వాములైన గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారుల అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. సోమవారం అన్ని శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి, మాట్లాడారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు.
Similar News
News March 14, 2025
మంచిర్యాల: వైద్యారోగ్య శాఖలో ఖాళీలు

మంచిర్యాల జిల్లా వైద్యారోగ్య శాఖలో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీ పోస్టుల భర్తీకి ఈ నెల 15 నుంచి 19 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ హరీశ్ రాజ్ తెలిపారు. వైద్య అధికారి, నర్సింగ్, ల్యాబ్ టెక్నీషియన్, పారామెడికల్ కం అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వివరించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు, ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు.
News March 14, 2025
నా కొడుకు తర్వాత సపోర్ట్ చేసేది ఆ హీరోకే: రోహిణి

నటి రోహిణి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. కొడుకు తర్వాత తాను సపోర్ట్ ఇచ్చే ఏకైక వ్యక్తి హీరో నాని అని ట్వీట్ చేశారు. ‘కోర్టు’తో ప్రేక్షకులకు ఆసక్తికర కథను ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. నాని ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే ప్రీమియర్ షోలు వేయగా మూవీని పలువురు ప్రముఖులు వీక్షించారు. కాగా రోహిణి, నాని కలిసి అలా మొదలైంది, అంటే సుందరానికి, జెంటిల్మెన్ వంటి చిత్రాల్లో నటించారు.
News March 14, 2025
చింతలమానేపల్లి: వనదేవతలకు నిప్పు పెట్టిన వ్యక్తి అరెస్ట్

డబ్బా గ్రామంలో కొన్ని రోజుల క్రితం సమ్మక్క సారలమ్మలకు గుర్తుతెలియని వ్యక్తి నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన SI నరేశ్ విచారణ చేపట్టి అదే గ్రామానికి చెందిన మల్లేశ్ @ హరీశ్‌ను సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిగా గుర్తించినట్లు తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకొని సిర్పూర్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా అతడికి మతిస్థిమితం లేదని, ఎర్రగడ్డకు తరలించాల్సిందిగా తీర్పునిచ్చినట్లు వెల్లడించారు.