News April 2, 2025

పది లక్షల మందితో వరంగల్‌లో BRS సభ!

image

ఈనెల 27న HNK ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈమేరకు ఉమ్మడి జిల్లా నాయకులతో మంగళవారం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అయితే సభకు, ఇతర అవసరాలకు దాదాపు 1200 ఎకరాల వరకు అవసరమని, RTC బస్సులతో పాటు ఇతర వాహనాలు 40 నుంచి 50 వేల వరకు వస్తాయని అంచనా వేస్తున్నట్లు సమాచారం. 10 లక్షల మందితో సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News

News April 4, 2025

IPL: అట్టడుగుకు పడిపోయిన SRH

image

ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన చేస్తోంది. ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింట్లో ఓడింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆ జట్టు అట్టడుగు స్థానానికి పడిపోయింది. టేబుల్ టాపర్‌గా పంజాబ్ కింగ్స్ కొనసాగుతోంది. 5 జట్లు 4 పాయింట్లతో, మరో 5 జట్లు 2 పాయింట్లతో నిలిచాయి. పాయింట్స్ టేబుల్‌లో PBKS తర్వాత DC, RCB, GT, KKR, MI, LSG, CSK, RR, SRH ఉన్నాయి.

News April 4, 2025

నాగర్‌కర్నూల్: పెద్దపులి దాడి.. యజమానులకు నష్టపరిహారం

image

NGKL జిల్లా అచ్చంపేట ప్రాంతంలో రెండు నెలల క్రితం పెద్దపులి దాడిలో మృతిచెందిన పశువుల యజమానులకు అటవీ శాఖ నష్టపరిహారం అందజేసింది. బక్క లింగాయపల్లి, దండాలం గ్రామాలకు చెందిన హరి, వెంకట్రామ్, రాకేశ్‌కు వరుసగా రూ.15,000, రూ.15,000, రూ.12,000 చొప్పున చెక్కులను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుబూర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నరేంద్ర, అధికారులు బాలరాజు, జ్యోతి, రజిత తదితరులు ఉన్నారు.

News April 4, 2025

SKZR: ఇద్దరి బైండోవర్.. రూ.2లక్షల జరిమానా

image

కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన యెనాం రాజు దేశీదారు అమ్ముతూ, ఈస్గం గ్రామానికి చెందిన సాయిరి రమేష్ బెల్లం రవాణ చేస్తూ పట్టుబడ్డారు. వారిపై ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేసి కాగజ్‌నగర్‌ తహశీల్దార్‌ వద్ద బైండోవర్‌ చేశారు. కానీ మళ్లీ వారు దేశీదారు, బెల్లము అమ్ముతూ పట్టుబడగా కాగజ్‌నగర్ తహశీల్దార్ కిరణ్ ఆ ఇద్దరికీ రూ.లక్ష చొప్పున జరిమానా విధించినట్లు ఎక్సైజ్ సీఐ రవికుమార్ తెలిపారు.

error: Content is protected !!