News April 2, 2025
పది లక్షల మందితో వరంగల్‌లో BRS సభ!

ఈనెల 27న HNK ఎల్కతుర్తిలో BRS సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈమేరకు ఉమ్మడి జిల్లా నాయకులతో మంగళవారం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అయితే సభకు, ఇతర అవసరాలకు దాదాపు 1200 ఎకరాల వరకు అవసరమని, RTC బస్సులతో పాటు ఇతర వాహనాలు 40 నుంచి 50 వేల వరకు వస్తాయని అంచనా వేస్తున్నట్లు సమాచారం. 10 లక్షల మందితో సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి సభకు మీరు వెళ్తున్నారా?
Similar News
News April 3, 2025
వరంగల్: 4 బార్ల లైసెన్స్‌లకు దరఖాస్తు

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గతంలో రెన్యువల్ కాకుండా మిగిలిన 4 బార్లకు సంబంధించి మళ్లీ లైసెన్స్‌లు జారీ చేయనున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. అర్హులు, ఆసక్తి గలవారు ఈనెల 26 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 29న కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా ద్వారా బార్లు మంజూరు చేస్తామని వెల్లడించారు.
News April 3, 2025
వర్ధన్నపేట: కనిపిస్తే ఫోన్ చేయండి

బుధవారం వర్ధన్నపేటలోని ఎస్బీఐ బ్యాంక్ వద్ద సినీ ఫక్కీలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. నందనం భారతమ్మ అనే వృద్ధురాలిని నమ్మించి ఓ వ్యక్తి రూ.3లక్షలు దోచుకెళ్లాడు. కాగా, నిందితుడి ఫోటోను వర్ధన్నపేట పోలీసులు విడుదల చేశారు. అతడి వివరాలు తెలిపితే రూ.10వేల నగదు ఇస్తామన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని వర్ధన్నపేట సీఐ శ్రీనివాస్ రావు తెలిపారు.
News April 3, 2025
ప్రాతఃకాల విశేష దర్శనంలో భద్రకాళి అమ్మవారు

భద్రకాళి దేవస్థానంలో చైత్ర మాసం గురువారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, భక్తులు తదితరులున్నారు.