News February 11, 2025

పదీ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్

image

జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 17 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 10,454 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని అన్నారు. పరీక్ష కేంద్రాల ద్వారా 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.

Similar News

News February 11, 2025

పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు: డీఆర్‌వో

image

మార్చి 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తామని శ్రీ సత్యసాయి జిల్లా డీఆర్‌వో విజయసారథి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణప్పతో కలిసి పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. డీఆర్‌వో మాట్లాడుతూ.. 10వ తరగతి పరీక్షలకు ఈ ఏడాది 23,730 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. 449 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

News February 11, 2025

జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల

image

జేఈఈ మెయిన్ మొదటి సెషన్ ఫలితాలను ఎన్టీఏ రిలీజ్ చేసింది. అభ్యర్థులు <>jeemain.nta.nic.in<<>> వెబ్‌సైట్‌లో తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. గతనెల 22 నుంచి 29 వరకు జరిగిన తొలి సెషన్ ఎగ్జామ్స్‌కు 12.5 లక్షల మంది హాజరయ్యారు. ఏప్రిల్ 1 నుంచి 8 వరకు రెండో సెషన్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.

News February 11, 2025

బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో నేటి ధరలు

image

బాదేపల్లి మార్కెట్లో ఇవాళ 296 మంది రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్మడానికి తీసుకువచ్చారు. వేరుశనగ 3,770 క్వింటాళ్లు అమ్మడానికి రాగా గరిష్ఠ ధర క్వింటాలుకు రూ. 6,809 లభించగా కనిష్ఠ ధర రూ. 4,265 లభించింది. కందులు 113 క్వింటాళ్లు అమ్మకానికి రాగా క్వింటాలుకు గరిష్ఠ ధర రూ.7,000, కనిష్ఠ ధర రూ. 4,002 లభించింది. మొక్కజొన్న 142 క్వింటాళ్లు అమ్మకానికి రాగా గరిష్ఠ ధర రూ. 2,361 కనిష్ఠ ధర రూ. 2,075 లభించింది.

error: Content is protected !!