News November 10, 2024
పదేళ్లుగా పాలమూరుకు కేసీఆర్ ఏం చేశారు: రేవంత్
పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ పాలమూరుకు ఏం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం కురుమూర్తి స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు, పరిశ్రమలు రాలేదు. ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వల్ల వలసలు కొనసాగుతున్నాయి. ప్రతి నెల జిల్లా ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తున్నాం. ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నాం’ అని రేవంత్ తెలిపారు.
Similar News
News November 14, 2024
పాలమూరులో ఫోన్ ట్యాపింగ్ కలకలం
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో కలకలం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు ఉన్నతాధికారులనే విచారించగా తాజాగా ప్రజాప్రతినిధుల వైపు మళ్లింది. విచారణలో భాగంగా జిల్లాకు చెందిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాలో ఫోన్ ట్యాపింగ్‌కు సహకరించిన ఆధికారుల పాత్రపైనా ఆరా తీస్తున్నట్లు సమాచారం. దీనిపై గతంలో MBNR ఎమ్మెల్యే ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
News November 14, 2024
లగచర్ల ఇష్యూ.. ఈ మండలాల్లో ఇంటర్నెట్ బంద్!
కోడంగల్ నియోజకవర్గం లగచర్లలో హైటెన్షన్ ఇంకా వీడలేదు. గ్రామం నిర్మానుష్యంగా మారింది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. గత రెండు రోజులుగా దుద్యాల, కొడంగల్, బోంరాస్‌పేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ కావడంతో BRS నాయకులు, కార్యకర్తలు ఆయా మండలాల్లో నిరసనలు తెలిపారు.
News November 13, 2024
అభివృద్ధి పేరుతో అమాయకుల భూములు లాక్కోవద్దు: డీకే అరుణ
అభివృద్ధి పేరుతో అమాయకుల భూములు లాక్కోవడం ఆపివేయాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. రైతులను పరామర్శించడానికి వెళ్తున్న ఎంపీని పోలీసులు మన్నెగూడ వద్ద అడ్డుకున్నారు. దీంతో ఆమె నిరసన వ్యక్తం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం సొంత నియోజకవర్గంలో శాంతిభద్రతల సమస్య నెలకొనడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆమె మండిపడ్డారు. అధికారం ఉందని అహంకారంతో ఏది పడితే అది చేయొద్దని సూచించారు.