News April 24, 2024

పదోతరగతి ఫలితాల్లో వైఎస్సార్ జిల్లా సత్తా

image

10th ఫలితాల్లో కడప జిల్లా 92.10% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 3 స్థానంలో నిలిచింది. 27,729 మందికి 25,538 పాసయ్యారు. 13,515 మంది బాలికలకు 12,609 పాసయ్యారు. బాలురు 14,214 మందికి గానూ 12,929 పాసయ్యారు. బాలికలు ఈసారి సత్తా చాటారు. కాగా 2023లో 79.43% ఉత్తీర్ణత సాధించగా, ఈసారి 92.10% సాధించారు. అటు అన్నమయ్య జిల్లా 86.67 ఉత్తీర్ణత శాతంతో 17వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 22,240 మందికి గానూ 19,276 పాసయ్యారు.

Similar News

News September 30, 2024

కడప జిల్లాలో ప్రొహిబిషన్ &ఎక్సైజ్ SIల బదిలీలు

image

రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లాలో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ SIల బదిలీలను చేపట్టింది. కడప జిల్లాలోని వివిధ ప్రాంతాల ఎక్సైజ్ SIల వివరాలు ఇలా ఉన్నాయి.
కడప- బి కృష్ణకుమార్
సిద్ధవటం- శ్రీ రాజశేఖర్
ఎర్రగుంట్ల- ఏ గోపికృష్ణ
జమ్మలమడుగు- సరితారెడ్డి
ప్రొద్దుటూరు- సివి సురేంద్రారెడ్డి
పులివెందుల- చెన్నారెడ్డి
ముద్దనూరు- విన్నీ లత
మైదుకూరు- ధీరజ్ రెడ్డి
బద్వేల్- సీతారామిరెడ్డి

News September 30, 2024

కడప: నేడు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం

image

ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు నేడు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు. నేటి ఉదయం 9:30 నుంచి 10:30 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. 08562-244437 ల్యాండ్ లైన్ నంబర్‌కు ప్రజలు ఫోన్ చేసి నేరుగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

News September 30, 2024

కడప జిల్లాలో పేలిన డిటోనేటర్.. కారణం?

image

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేముల మండలం వి కొత్తపల్లి గ్రామంలో <<14229836>>డిటోనేటర్ పేలి VRA మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా ఆమెను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే మైనింగ్ కోసం ఉంచిన డిటోనేటర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.