News February 19, 2025
పదోన్నతి భాద్యతలను పెంచుతుంది: కలెక్టర్

పదోన్నతి భాద్యతలను పెంచుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ కలెక్టరేట్ లోని రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లను కమారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు సీనియర్ అసిస్టెంట్లుగా కేటాయించడం జరిగిందన్నారు. వృత్తినే దైవంగా భావించి ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని అన్నారు. అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 14, 2025
MDK: 2 ఓట్లతో స్వప్న విజయం

నిజాంపేట మండలం నందిగామలో బీజేపీ మద్దతుదారు షేరి స్వప్న 2 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు. గ్రామంలో వారి మద్దతుదారులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూతన పాలక వర్గం ఆధ్వర్యంలో గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుపోతామని వారు పేర్కొన్నారు. నమ్మకంతో గెలిపించిన గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు.
News December 14, 2025
MDK: 4 ఓట్లతో కనకరాజు విజయం

నిజాంపేట మండల పరిధిలోని రజాక్ పల్లిలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి సునీతపై బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి వోజ్జ కనకరాజు 4 ఓట్లతో విజయం సాధించాడు. మండలంలో బీఆర్ఎస్ మొదటి విజయంతో ఖాతా ఓపెన్ చేయడం విశేషం. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందడంతో గ్రామంలో గ్రామస్థులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. రానున్న రోజుల్లో గ్రామ అభివృద్ధికి సహకరిస్తామని అభ్యర్థి తెలిపారు.
News December 14, 2025
మెదక్ జిల్లాలో రెండో విడతలో 88.80% పోలింగ్

మెదక్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. చేగుంట, మనోరాబాద్, మెదక్, నార్సింగి, నిజాంపేట్, రామాయంపేట, శంకరంపేట (ఆర్), తూప్రాన్ మండలాల్లో పోలింగ్ నిర్వహించగా 88.80 శాతం నమోదైంది. మొత్తం 1,72,656 ఓటర్లలో 1,53,313 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అన్ని మండలాల్లో సర్పంచ్ ఎన్నికలు శాంతియుతంగా జరిగాయి.


