News July 10, 2024
పద్మనాభం యుద్ధానికి నేటితో 230 ఏళ్లు..!

విశాఖపట్నం జిల్లా పద్మనాభంలో 1794 జులై 10న ఆంగ్లేయులు విజయనగరం సంస్థానాధీశులు మధ్య జరిగిన యుద్ధానికి నేటికి 230 ఏళ్లు. ఆ యుద్ధంలో చినవిజయరామరాజుతో పాటు 394 మంది మరణించారు. దీంతో ఆ యుద్ధాన్ని స్కాట్లాండ్ ప్లోడెన్ యుద్ధంతో పోల్చారు. చినవిజయరామరాజును మచిలీపట్నం పంపించడానికి పన్నాగం పన్నగా అతను తన సామంతులతో కలిసి పద్మనాభం వద్ద ఆంగ్లేయులపై యుద్ధం చేసి వీరమరణం పొందారు. అక్కడే ఆయనకు సమాధి నిర్మించారు.
Similar News
News March 11, 2025
విజయనగరం జిల్లాలో మైనార్టీలకు గుడ్ న్యూస్

ముస్లింలు, క్రైస్తవులు, బౌద్దులు, సిక్కులు, జైనులు, పార్శీకుల రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.ఎస్.జాన్ సోమవారం కోరారు. వివిధ బ్యాంకుల నుంచి సబ్సిడీతో కూడిన రుణాలను అందించనున్నట్లు తెలిపారు. వయసు 21- 55 లోపు ఉండాలన్నారు. తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డుతో ఆన్ లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
News March 11, 2025
VZM: ఆదర్శ దివ్యాంగ జంటలకు అభినందన

ఆదర్శ వివాహం చేసుకున్న దివ్యాంగ జంటలను ఇన్‌ఛార్జి జాయింట్ కలెక్టర్ శ్రీనివాసమూర్తి సోమవారం ఆశీర్వదించారు. విజయదుర్గా దివ్యాంగుల సంక్షేమ సంఘం, హెల్పింగ్ హేండ్స్ హిజ్రాస్ సంస్థ సమక్షంలో రెండు విభిన్న ప్రతిభావంతుల జంటలకు వివాహం చేశాయి. జిల్లాకు చెందిన నారాయణ, శ్రీసత్య అలాగే సత్య ఆచారి, విజయలక్ష్మి ఆదర్శ వివాహం చేసుకున్నారు. ఈ రెండు జంటలను శ్రీనివాస్ మూర్తి అభినందించారు.
News March 10, 2025
పొక్సో కేసులో నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష: VZM SP

గంట్యాడ మండలంలోని కొటారుబిల్లికి చెందిన రవి ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిపై స్థానిక మహిళా పోలీస్ స్టేషన్‌లో గత ఏడాది అక్టోబర్ 27 ఫోక్సో కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని కోర్టులో ప్రవేశ పెట్టామన్నారు. నేరం రుజువు కావడంతో 134 రోజుల్లోనే శిక్ష ఖరారైందన్నారు. నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష రూ.10వేల జరిమానాను కోర్టు విధించిందని ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం తెలిపారు.