News January 19, 2025
పద్యాలతో జ్ఞానజ్యోతిని వెలిగించిన లోకకవి వేమన: JNTU ఇన్ఛార్జ్ వీసీ
అనంతపురం JNTUలోని పరిపాలన భవనంలో ఆదివారం యోగి వేమన జయంతిని పురస్కరించుకొని JNTU ఇన్ఛార్జ్ వీసీ సుదర్శనరావు, రిజిస్ట్రార్ కృష్ణయ్యతో కలిసి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇన్ఛార్జ్ వీసీ మాట్లాడుతూ.. ఎంతో అద్భుతమైన పద్యాలతో ప్రపంచానికి జ్ఞానజ్యోతిని వెలిగించిన లోకకవి వేమన అని కొనియాడారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ వీసీతో పాటు పలువురు బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News January 22, 2025
హలో అనంతపూర్.. వచ్చేస్తున్నాం: బాబీ
అనంతపురంలో ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ‘డాకు మహారాజ్’ విజయోత్సవ పండుగ జరగనుది. ఈ వేడుకకు చిత్ర యూనిట్ తరలివస్తోంది. ఈ క్రమంలో హలో అనంతపూర్.. అంటూ డైరెక్టర్ బాబీ ట్వీట్ చేశారు. ‘డాకు మహారాజ్ విజయోత్సవ పండుగకి వచ్చేస్తున్నాం. ఈ సాయంత్రం అంతా కలుద్దాం’ అని పోస్ట్ పెట్టారు. ఆయనతో పాటు బాలకృష్ణ, ప్రగ్యాజైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశీ రౌతేలా, తమన్, నిర్మాత నాగ వంశీ, సినీ ప్రముఖులు రానున్నారు.
News January 22, 2025
అనంతపురానికి తారల రాక
అనంతపురంలో నేడు ‘డాకు మహారాజ్’ మూవీ <<15219121>>టీమ్<<>> సందడి చేయనుంది. నగరంలోని శ్రీనగర్ కాలనీ సమీపంలో సాయంత్రం జరగనున్న విజయోత్సవ వేడుకకు సినీ తారలు తరలిరానున్నారు. హీరో బాలకృష్ణ, కథానాయికలు ప్రగ్యాజైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, గ్లామర్ రోల్లో కనిపించిన ఊర్వశి రౌతేలా, దర్శకుడు బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నిర్మాత నాగ వంశీ తదితరులు సందడి చేయనున్నారు. మరోవైపు పాసులు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తారు.
News January 22, 2025
మడకశిరలో ₹2400 కోట్ల పెట్టుబడి!
భారత్ ఫోర్జ్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బి.కళ్యాణిని దావోస్లోమంత్రి నారా లోకేశ్ కలిశారు. రక్షణ తయారీ ప్రాజెక్టు గురించి చర్చించారు. మడకశిర నియోజకవర్గం ముర్దనహళ్లిలో 1000 ఎకరాల్లో ₹2400 కోట్లతో రక్షణ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు కళ్యాణి తెలిపారు. ఈ సందర్భంగా సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించాలని మంత్రి లోకేశ్ ఆయనను కోరారు.