News March 30, 2025

పన్నులపై 50% వడ్డీ రాయితీ పొందండి: కలెక్టర్

image

జీవీఎంసీ పరిధిలో చెల్లించవలసిన ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయిదారులకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ గుడ్‌న్యూస్ చెప్పారు. పన్ను మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తే వడ్డీపై 50 శాతం వడ్డీ మినహాయింపు ఇచ్చినట్లు ఆయన మంగళవారం తెలిపారు. మార్చి 31వ తేదీ లోగా బకాయిలు చెల్లించి ఈ లబ్ధి పొందాలని సూచించారు.

Similar News

News April 2, 2025

సింహాచలం అప్పన్న రథసారథికి ఆహ్వానం

image

సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవం ఈనెల 8న జరగనుంది. అదే రోజు రాత్రి 7 గంటలకు స్వామివారి రథోత్సవం నిర్వహించనున్నారు. ఆలయ సహాయక కార్యనిర్వాహణాధికారి ఆనంద్ కుమార్ రథోత్సవానికి రథసారథి అయిన కదిరి లక్ష్మణరావును తన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రికను, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. కదిరి లక్ష్మణరావు వంశానికి చెందిన వారే దశాబ్దాలుగా రథోత్సవం సారథిగా ఉండడం అనవాయితీ.

News April 2, 2025

విశాఖ సీపీకి హోం మంత్రి ఫోన్

image

కొమ్మాది స్వయంకృషినగర్‌లో ప్రేమోన్మాది దాడి ఘటనపై హోం మంత్రి అనిత స్పందించారు. విశాఖ సీపీ శంఖబ్రత భాగ్చీతో ఫోన్‌లో మాట్లాడిన ఆమె.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దివ్య ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. దివ్యకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. ప్రేమోన్మాదిని త్వరగా గాలించి పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. దివ్య తల్లి లక్ష్మి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

News April 2, 2025

మధురవాడ: తల్లి, కుమార్తెపై ప్రేమోన్మాది దాడి

image

విశాఖలో బుధవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. కొమ్మాది సమీపంలోని స్వయంకృషి నగర్‌లో తల్లి, కూతురిపై ఒక ప్రేమోన్మాది దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతిచెందిగా కుమార్తె పరిస్థితి విషమంగా మారింది. స్థానికులు సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!