News July 11, 2024

పయ్యావుల కేశవ్ ఫ్యామిలీ ఫొటో

image

విజయవాడ సచివాలయంలోని రెండో బ్లాకులోని తన ఛాంబర్‌లో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం కుటుంబసభ్యులతో ఫోటో దిగారు. తన విజయానికి కుటుంబసభ్యుల సహకారం ఎంతో ఉందని పయ్యావుల తెలిపారు. ఎన్నికల్లో తన గెలుపు కోసం తన కుమారులు విక్రమ్ సింహ, విజయ్ సింహ ప్రతి గ్రామంలో ప్రచారం నిర్వహించారు.

Similar News

News March 13, 2025

అందరూ సమష్టిగా పని చేయాలి: RJD

image

అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశాల మేరకు స్థానిక SSBN డిగ్రీ కళాశాలలోని వర్చువల్ రూమ్‌లో CS, DOలకు వర్చువల్ ప్రోగ్రామ్ జరిగింది. పదో పరీక్షలు ఈనెల 17 నుంచి ప్రారంభం కానున్నాయని RJD శ్యామ్యూల్ తెలిపారు. చీప్ సూపర్వైజర్, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరూ సమష్టిగా పని చేయాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి స్మార్ట్ వాచ్, ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లరాదని సూచించారు.

News March 13, 2025

రామాయణం రాసిన తొలి కవియిత్రి అతుకూరి మోలమాంబ: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కవియిత్రి అతుకూరి మోలమాంబ జయంతి అనంతపురం జిల్లాలో ఘనంగా జరిగింది. అనంతపురం నగరంలోని రెవెన్యూ భవన్‌లో కవియిత్రి అతుకూరి మోలమాంబ చిత్రపటానికి కలెక్టర్ వినోద్ కుమార్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రామాయణం రాసిన తొలి కవియిత్రి అతుకూరి మోలమాంబ అని జిల్లా కలెక్టర్ తెలిపారు. నాట్య పోటీల్లో గెలిచిన విద్యార్థులకు కలెక్టర్ బహుమతి ప్రదానం చేశారు.

News March 13, 2025

అనంతపురం కోర్టులో నారా లోకేశ్‌పై ఫిర్యాదు 

image

అనంతపురం కోర్టులో మంత్రి నారా లోకేశ్‌పై వైసీపీ నేత చవ్వా రాజశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రులు రోజా, విడదల రజిని ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు చేస్తున్నారని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, దీంతో న్యాయం కోసం కోర్టును ఆశ్రయించామన్నారు. ఆ పోస్టుల వెనుక లోకేశ్ ఉన్నారని ఆరోపించారు.

error: Content is protected !!