News April 18, 2025

పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలను పాటించాలి: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో అన్ని పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలను పాటించాలని, ప్రమాదాలు జరుగకుండా తగిన చర్యలను తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం అనంతపురం కలెక్టరేట్లో డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ మీటింగ్ & డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సేఫ్టీ కమిటీ మీటింగ్‌లను జిల్లా కలెక్టర్ నిర్వహించారు. పరిశ్రమలలో ప్రమాదకర రసాయనాలపై కార్మికులకు అవగాహన కల్పించాలన్నారు.

Similar News

News April 19, 2025

అమరాపురం: ట్రాక్టర్ కిందపడి యువకుడి మృతి

image

ఉమ్మడి అనంతపురం జిల్లా అమరాపురం మండలంలోని కాచికుంటకు చెందిన యువకుడు మంజునాథ్ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాచికుంట గ్రామంలో ఓ రైతుకు చెందిన పొలంలో యువకుడు ట్రాక్టర్‌తో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. ఆ సమయంలో ట్రాక్టర్ అతనిపై నుంచి వెళ్లింది. యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 19, 2025

కలెక్టర్& SPలతో సమావేశమైన మంత్రి భరత్

image

అనంతపురం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి టీజీ భరత్‌ను జిల్లా కలెక్టర్ వినోద్, ఎస్పీ జగదీశ్ శుక్రవారం కలిశారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో మంత్రి భరత్ గంటపాటు సమీక్షించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మంత్రి కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్, ఎస్పీల పర్యవేక్షణలో జిల్లా ప్రభుత్వ అధికారుల పనితీరు బాగుందని మంత్రి కొనియాడారు.

News April 19, 2025

ATP: తాడిపత్రి ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పిస్తా – ఎంపీ

image

అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య ఉపకరణాలకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకుడు వై నారాయణరెడ్డి, మల్లికార్జున రెడ్డి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను శనివారం కలిశారు. అనంతపురంలోని ఎంపీ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎంపీ రూ. కోటి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. 

error: Content is protected !!