News July 5, 2024

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి: కలెక్టర్

image

డెంగ్యూ, విషజ్వరాలు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని MBNR జిల్లాకలెక్టర్ విజయేంద్ర బోయి సూచించారు. డ్రైడే సందర్భంగా శుక్రవారం పట్టణంలోని జగ్జీవన్ రామ్ నగర్ కాలనీలలో పర్యటించి ఆమె పరిశీలించారు. చెత్త, చెదారం రోడ్లపై, డ్రైనేజీలలో వేయరాదని కాలనీవాసులకు సూచించారు. మురుగునీరు ప్రవహించేలా డ్రైనేజీలను శుభ్రపరచాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News January 23, 2025

జడ్చర్ల: అందరికీ ఇల్లు, రేషన్ కార్డులు వస్తాయి: ఎమ్మెల్యే 

image

జడ్చర్ల మండలంలోని నసురుల్లాబాద్ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు మంజూరులో ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరిగినా తాను సహించేది లేదని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికీ ఇళ్లు, రేషన్ కార్డులు మంజూరయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యత ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అధికారులదేనని స్పష్టం చేశారు.

News January 23, 2025

కౌకుంట్ల : పేరూరులో సభ.. సద్వినియోగం చేసుకోండి

image

కౌకుంట్ల మండలం పేరూరు గ్రామంలో నేడు ఉదయం 10:00 గంటలకు నిర్వహించే గ్రామ సభలో దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జీ. మధుసుధన్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐ సీసీ సెక్రటరీ, తెలంగాణ ఇన్‌ఛార్జ్ విశ్వనాథ్ అదే పాల్గొంటారు. ఈ సభను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జీఎంఆర్ తెలిపారు. ఇంద్రమ్మ ఇల్లు, రేషన్ కార్డు, ఆత్మీయ బరోసా కు వినతి పత్రాలను ఇవ్వాలన్నారు.

News January 22, 2025

MBNR: ప్రజల సమస్యలు తెలుసుకోడానికే గ్రామసభలు: మంత్రి

image

భూత్పూర్ మండలంలోని కప్పెట గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజ నరసింహ పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. గ్రామ సభల ద్వారా ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకోవచ్చన్నారు. ప్రజలతో మమేకం కావడానికి, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, వాస్తవ పరిస్థితులను గుర్తించడానికి ఇలాంటి గ్రామసభలు ఉపయోగపడుతాయని తెలిపారు. ఆయన వెంట దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఉన్నారు.