News November 12, 2024
పరీక్ష కేంద్రాలకు ముందుగానే రావాలి: NZB కలెక్టర్
ఆర్మూర్ మార్గంలో అడవి మామిడిపల్లి వద్ద ఆర్యూబీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 17, 18 తేదీల్లో గ్రూప్ -3 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిర్ణీత సమయం కంటే ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఆర్యుూబీ పనులు జరుగుతున్నందున నవంబర్ 10 నుంచి డిసెంబర్ 10 వరకు నిజామాబాద్ – ఆర్మూర్ మార్గంలో రాకపోకలు మళ్లించామన్నారు.
Similar News
News November 14, 2024
NZB: ‘రిజిస్ట్రేషన్ సేవలు నిలిపివేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం’
నిజామాబాదు జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో సేవలు నిలిపివేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమైనవని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిజామాబాద్ డీఐజీ రమేశ్ రెడ్డి, జిల్లా రిజిస్ట్రార్ ప్రసూన గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని పది రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో సేవలు అందించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యాలయ సిబ్బంది ఎలాంటి బందులు పాటించడం లేదని తెలిపారు.
News November 14, 2024
ACBకి చిక్కిన లింగంపేట ఎస్ఐ
కామారెడ్డి జిల్లా లింగపేట ఎస్ఐ అరుణ్, రైటర్ రామాస్వామి పోలీస్ స్టేషన్లోనే లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఒక కేసు విషయంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో సిబ్బంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 14, 2024
శ్రీ చైతన్య కాలేజీలో కామారెడ్డి విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్‌లోని నిజాంపేట్ శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుకున్న విద్యార్థి జస్వంత్ గౌడ్ బుధవారం రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఉదయం విద్యార్థులు లేచి చూసేసరికి జస్వంత్ మృతి చెంది ఉన్నట్లు సిబ్బంది వెల్లడించారు. మృతి చెందిన విద్యార్థి కామారెడ్డి జిల్లాకు చెందిన వాసిగా పోలీసులు గుర్తించారు.